ముద్దు పెట్టలేదని రిజెక్ట్‌ చేసింది: అక్షయ్‌

20 Jan, 2021 10:30 IST|Sakshi

బాలీవుడ్‌లో సక్సెస్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నారు ఖిలాడి హీరో అక్షయ్‌ కుమార్. ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేస్తూ.. బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తారు. పూర్తిగా కమర్షియల్‌ చిత్రాలనే కాక.. తనలోని నటుడిని సంతృప్తి పరిచే సినిమాలు కూడా చేస్తూ.. విజయవంతంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తాజాగా హౌస్‌ఫుల్‌ 4 ప్రమోషన్‌లో భాగంగా అక్షయ్‌, కపిల్‌ శర్మ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన ఫస్ట్‌ లవ్‌, రిజెక్షన్‌ల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు అక్షయ్‌.

ఈ సందర్భంగా అక్షయ్‌ మాట్లాడుతూ.. ‘ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. తనతో కలిసి మూడు నాలుగు సార్లు డేట్‌కు వెళ్లాను. అంటే తనతో కలిసి సినిమాకు వెళ్లి అట్నుంచి అటే రెస్టారెంట్‌కి వెళ్లి భోంచేసే వాళ్లం. అయితే నాలో ఉన్న సమస్య ఏంటంటే నాకు చాలా సిగ్గు. తనతో బయటకు వెళ్లినప్పుడు ఆమె భుజం మీద చేతులు వేయడం.. తన చేతిని పట్టుకోవడం.. కిస్‌ చేయడం లాంటివి చేయలేదు. దాంతో ఆమె నన్ను రిజెక్ట్‌ చేసింది’’ అన్నారు. అయితే దీనిపై నెటిజనులు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘మీరు ప్రపోజ్‌ చేయాలని ఆ అమ్మాయి భావించి ఉటుంది. కానీ మీరేమో ముద్దు పెట్టలేదు అందుకే వదిలేసింది అంటున్నారు.. బహుశా మీరే తప్పులో కాలేసిట్లున్నారు. అయినా మీకు ట్వింకిల్‌ లాంటి అందమైన భార్య లభించాలని రాసి పెట్టి ఉంది. అందుకే ఆమె మిమ్మల్ని రిజెక్ట్‌ చేసింది’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు. (చదవండి: అనుకోని అతిథి.. షాక్‌ అయిన సూపర్‌ స్టార్‌)

ఇక అక్షయ్‌-ట్వింకిల్‌ ఖన్నాల వివాహ బంధానికి ఈ ఏడాదితో 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా భార్య ట్వింకిల్‌ ఖన్నాతో కలిసి ఉన్న ఫోటో షేర్‌ చేస్తూ.. ‘‘నేను నీతో భాగస్వామ్యంలో ఉన్నాను... మనం ఇరవై సంవత్సరాల సమైక్యతకు చిహ్నంగా నిలిచాము. నువ్వు ఇప్పటికీ నా హృదయాన్ని కదిలిస్తావు.. నన్ను నడిపిస్తావు. నువ్వు నాకు దూరంగా ఉన్నా నీ నవ్వు నన్ను సేదదీరుస్తుంది. వార్షికోత్సవ శుభాకాంక్షలు టీనా’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు అక్షయ్‌ కుమార్‌. ఇక ప్రస్తుతం ఆయన బచ్చన్‌ పాండే చిత్రంలో నటిస్తున్నారు. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు