సమంతకు కొడుకుగా నటించేది ఈ స్టార్‌ హీరో తనయుడే!

9 Jun, 2021 16:09 IST|Sakshi

సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తొలి పీరియాడికల్‌ చిత్రం "శాకుంతలం". దుష్యంతుడు- శకుంతల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శకుంతల పాత్రలో సమంత, గుణశేఖర్‌ పాత్రలో మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం సమంత నాలుగు నెలలపాటు క్లాసికల్‌ డ్యాన్సులు కూడా నేర్చుకుంది. ఇదిలా వుంటే శాకుంతలంలో సమంత కొడుకు పాత్రలో ఎవరు నటించనున్నారు? అనేదానిపై ఫిల్మీదునియాలో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.

శాకుంతలం కొడుకు భరత్‌ పాత్ర కోసం స్టార్‌ హీరోల కొడుకులను సంప్రదిస్తున్నారట. జూనియర్‌ ఎన్టీఆర్‌ పెద్ద కొడుకు అభయ్‌ రామ్‌ లేదా అల్లు అర్జున్‌ కొడుకు అయాన్‌లలో ఎవరో ఒకరిని శాకుంతలం సినిమాకు రప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ముందుగా జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఈ విషయమై సంప్రదించనున్నాడట గుణశేఖర్‌. ఒకవేళ అభయ్‌ రామ్‌ కాదంటే భార్గవ్‌ రామ్‌తో అయినా ఆ పాత్ర చేయించమని ఎన్టీఆర్‌ను రిక్వెస్ట్‌ చేస్తాడట.

కుదరదంటే అప్పుడు బన్నీ దగ్గరికెళ్లి అతడి కొడుకును భరత్‌ పాత్ర కోసం ఒప్పించే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ చర్చలు ఎంతవరకు వెళ్తాయి? సమంతకు కొడుకుగా ఎవరు నటిస్తారు? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే! ఇదిలా వుంటే శాకుంతలం చిత్రాన్ని 'దిల్‌' రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై గుణశేఖర్‌ కుమార్తె నీలిమ నిర్మిస్తోంది.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

చదవండి: నా స్థాయిని మించి శాకుంతలం బడ్జెట్‌: సమంత

ఈ స్టార్‌ హీరోలు ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటు​న్నారో తెలుసా?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు