'ఇలియానా అలా చేసిందా? అందుకే తెలుగులో అవకాశాలు రావట్లేదా?'..

9 Jun, 2021 15:37 IST|Sakshi

దేవదాసు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన గోవా బ్యూటీ ఇలియానా. పోకిరీ సినిమాతో ఎంతో మంది కుర్రాళ్ల మనసు గెలుచుకున్న ఈ బ్యూటీ పలువురు స్టార్‌ హీరోలతో జతకట్టి తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా చక్రం తిప్పింది. కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే అనుకోకుండా బాలీవుడ్‌కు మకాం మార్చిన ఇలియానా ఆ తర్వాత టాలీవుడ్‌కు దూరమైంది. దీంతో సౌత్‌లో ఆమెకు క్రమంగా సనిమాలు కరువయ్యాయి. మరోవైపు బాలీవుడ్ కూడా ఈ అమ్మడికి అంతగా కలిసి రాలేదు.ఆ సమయంలోనే బాయ్‌ఫ్రెండ్‌తో విభేదాలు రావడంతో లాంగ్‌ బ్రేక్‌ తీసుకుంది. ఈ క్రమంలో విపరీతంగా బరువు పెరిగి అందరికీ షాకిచ్చింది. అప్పటివరకు నాజుగ్గా కనిపించిన ఇలియానా అనూహ్యంగా బరువు పెరిగి ఆశ్చర్యపరిచింది.

ఇక మళ్ళీ లైన్ లోకి వచ్చి ఆమె పాగల్ పత్ని అనే సినిమా ఆలాగే అభిషేక్ బచ్చన్‌‌తో ‘బిగ్‌ బుల్' అనే సినిమాలో నటించింది. బాలీవుడ్‌పై ప్రేమతో గోవీ బ్యూటీ టాలీవుడ్‌కు దూరమైందని, అందుకే ఇక్కడి సినిమాలు చేయడం లేదని అందరూ భావించారు. అయితే నిజానికి దీని వెనుక వేరే కారణం ఉందని దర్శక నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. “దేవుడు చేసిన మనుషులు సినిమా చేస్తున్నప్పుడు ఇలియానా విక్రమ్‌ హీరోగా ఓ సినిమా ఒప్పుకుంది. అయితే కొన్ని కారణాలతో ఆ సినిమా షూటింగ్‌ ఆగిపోయింది. దీంతో ముందుగా అడ్వాన్స్ గా తీసుకున్న 40 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వాలని ఆ తమిళ నిర్మాత ఇలియాను కోరగా అందుకు ఆమె ఒప్పుకోలేదు.

ఈ విషయంపై ఆయన తమిళ నిర్మాతల మండలిని కూడా సంప్రదించారు. అక్కడ కూడా ఈ విషయం పరిష్కారం కాకపోవడంతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ వద్దకు ఈ వ్యవహారం వెళ్ళింది. దీంతో ఇలియానాపై అధికారికంగా బ్యాన్ విధించకుండానే అనధికారికంగా ఆమెను సౌత్ సినిమాలలోకి తీసుకోకూడదని నిర్ణయించారు'' అని వెల్లడించారు. ఈ కారణంగానే ఇలియానా టాలీవుడ్‌కు దూరమైందని తెలిపాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్‌ హాట్‌ టాపిక్‌గా మారాయి. 

చదవండి : సినీ పరిశ్రమ క్రూరమైంది, ఇక్కడ ఆ నియమాలు ఉండవు: హీరోయిన్‌
ప్రియదర్శి భార్య గురించి ఈ విషయాలు తెలుసా? ఆమె ప్రొఫెషన్‌ ఏంటంటే..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు