పవన్‌ సినిమాలో అనసూయకు 'స్పెషల్‌' ఛాన్స్‌.?

19 Jan, 2021 16:00 IST|Sakshi

యాంకర్‌గా ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ భరద్వాజ్‌.. అవకాశం వచ్చినప్పుడల్లా వెండితెరపై కూడా తళుక్కుమంటున్నారు. సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ నటిగానూ ఆకట్టుకుంటుంది. ఇక రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ అభినయంతో  విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం భారీగా ఆఫర్లు వస్తున్నా అనసూయ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తాజాగా అనసూయకి  ఓ క్రేజీ ఆఫర్‌ వరించినట్లు టాలీవుడ్‌ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ -క్రిష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఓ అప్‌కమింగ్‌ ప్రాజెక్టులో అనసూయ ప్రత్యేకగీతంలో కనిపించనుందట. (అల్లు అర్జున్‌కు నో చెప్పిన అనసూయ)

వకీల్‌సాబ్‌ నిమా చిత్రీకరణ పూర్తికాగానే పవన్.. క్రిష్ సినిమాలో బిజీ కానున్నారు. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. గతంలోనూ పవన్‌ సినిమా అత్తారింటికి దారేదిలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో నటించడానికి అనసూయకు ఛాన్స్‌ వచ్చినా కొన్ని కారణాల వల్ల ఆ అవకాశాన్ని వదులుకున్నారు. ఇప్పుడు మరోసారి పవన్‌ సినిమాలో  ఛాన్స్‌ రావడంతో ఈసారి వెంటనే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లుగా టాక్‌. వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న అనసూయ  ప్రస్తుతం ఆమె కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగ మార్తాండ’లో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే రవితేజ హీరోగా వస్తోన్న ‘కిలాడి’లో కూడా నటిస్తున్నారు. అంతేకాకుండా కమెడియన్‌ సునీల్‌ హీరోగా తెరకెక్కుతున్న 'వేదాంతం రాఘవయ్య' సినిమాలోనూ అతడికి జోడీగా నటించేందుకు అనసూయ పచ్చజెండా ఊపినట్లు సమాచారం.  రీసెంట్‌గా తమిళంలోనూ విజయ్ సేతుపతితో ఓ సినిమాలో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది.  (కరోనా లక్షణాలు కనిపించాయి.. జాగ్రత్త : అనసూయ)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు