కోలీవుడ్‌: సిల్క్‌ స్మితగా అనసూయ..

7 Dec, 2020 11:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జబర్దస్త్ యాంకర్‌గా బుల్లితెరపై తళుక్కుమన్న అనసూయ భరద్వాజ్‌ అవకాశం వచ్చినప్పడల్లా వెండితెరపై మెరుస్తున్నారు. అయితే సినిమాల సెలక్షన్స్‌లలో ఆనసూయ ఆచితూచి అడుగు వేస్తున్నారు. గ్లామర్‌ అయినా డీగ్లామరైన పాత్ర నచ్చితేనే ఒకే చెబుతారు. లేదంటే ఎంత పెద్ద దర్శకుడికైన మొహమాటం లేకుండా నో అంటారు. ఈ క్రమంలో ‘రంగస్థలం’లో రంగమ్మత్త క్యారెక్టర్‌లో నటించి మంచి మార్కులు కొట్టెసిన అనసూయ తాజాగా కోలీవుడ్‌లో కూడా అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ సేతుపతితో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్‌ను ఆదివారం సోషల్‌ మీడియలో పోస్టు చేశారు అనసూయ. తన ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో షేర్‌ చేస్తూ.. ‘మరో మంచి కథ.. కొత్త ఆరంభం.. కోలీవుడ్‌’ అనే క్యాప్షన్‌ జత చేశారు. అంతేగాక రిఫరెన్స్‌ సిల్క్ ‌స్మిత గారు అంటూ ఆమె పేరును ట్యాగ్‌ చేశారు. ఈ ఫొటోలో అనసూయ అద్దంలో తన రూపాన్ని చూసుకుంటూ ఫొజు ఇచ్చి కనిపించారు.​ (చదవండి: సేతుపతితో రంగమ్మత్త?!)

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

అయితే విజయ్‌ సేతుపతితో కలిసి నటిస్తున్న ఈ సినిమా నాటి గ్లామర్‌ బ్యూటీ సిల్క్‌ స్మిత బయోపిక్‌గా రూపొందనుందని ఇందులో అనసూయ లీడ్‌రోల్‌ పోషిస్తున్నట్లు సమచారం. అనసూయ ఇప్ప‌టికే చిరంజీవి, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న‌ 'ఆచార్య' సినిమాలో కీల‌క పాత్ర‌ చేస్తున్న విషయం తెలిసిందే. అంతేగాక కృష్ణవంశీ ‘రంగమార్తాండ’లో కూడా ఆమె ఓ స్పెష‌ల్ రోల్ చేయనున్నారు. ఇప్పుడు తాజాగా మాస్ మ‌హారాజు ర‌వితేజ 'ఖిలాడీ' చిత్రంలో ముఖ్య పాత్ర‌లో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘రాక్షసుడు’ ఫేమ్‌ రమేష్‌ వర్మ తెర‌కెక్కిస్తున్న‌ 'ఖిలాడి' చిత్రం ఫస్ట్‌లుక్ పోస్ట‌ర్ ఇటీవ‌లే విడుద‌లైన విషయం తెలిసిందే. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పంద‌న ల‌భించింది. ర‌వితేజ డబుల్‌ రోల్‌ చేస్తున్న‌ ఈ సినిమాలో మీనాక్షి చౌద‌రి, డింపుల్ హ‌యాతి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఇందులో అన‌సూయ ముఖ్య పాత్ర పోషించడమే కాక‌ ఓ స్పెష‌ల్ సాంగ్‌లో ర‌వితేజతో క‌లిసి చిందులేయ‌న్నారంట‌. (చదవండి: అందుకే అనసూయ పాత్రను తిరస్కరించాను: రాశి)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు