మ్యాగీని ప్రేమించేవాళ్లందరూ నాకిష్టమే: మాళవిక

8 Feb, 2021 08:26 IST|Sakshi

తమిళ స్టార్‌ ధనుష్‌ హీరోగా, మాళవిక మోహనన్‌ హీరోయిన్‌గా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇది ధనుష్‌కు 43వ చిత్రం. కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ ఇటీవలే పూర్తైంది. ఈ విషయాన్ని మాళవిక ట్విటర్‌ పోస్టు ద్వారా అధికారికంగా తెలిపింది. హీరోతో కలిసి టైం స్పెండ్‌ చేస్తున్న క్షణాలను క్యాప్చర్‌ చేసిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

"ధనుష్‌ను కలవడం, అతడితో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి రోజు నీ దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నా. తొలి షెడ్యూల్‌ పూర్తైంది. రెండో పార్ట్‌ షూటింగ్‌ కోసం ఎదురు చూస్తున్నా. నీ నవ్వులు మిస్‌ అవుతున్నా ధనుష్‌. మనిద్దరికీ మ్యాగీ అంటే ఎంతో ఇష్టమో కదూ" అని రాసుకొచ్చింది. దీనికి ఓ నెటిజన్‌ 'ఐ టూ లవ్‌ మ్యాగీ' అని కామెంట్‌ చేశాడు. అది చూసిన హీరోయిన్‌ 'మ్యాగీని ప్రేమించే ప్రతి ఒక్కరూ నాకిష్టమే..' అని రిప్లై ఇచ్చింది. దీంతో చాలా మంది 'ఇప్పటి నుంచి నాకూ మ్యాగీ ఫేవరెటే' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇదిలా వుంటే ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ చిత్ర దర్శక ద్వయం రుస్సో బ్రదర్స్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది గ్రే మ్యాన్‌’ అనే యాక్షన్‌ చిత్రం కోసం ధనుష్‌ అమెరికా వెళ్లనున్నారు. ఇందులో ధనుష్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఈ నెల నుంచి ప్రారంభం కానున్న సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి ఆయన అమెరికా వెళ్తున్నాడు. దీంతో తన 43వ చిత్రానికి స్వల విరామం ప్రకటించాడు. మేలో షూటింగ్‌ పునః ప్రారంభించనున్నారు. (చదవండి: సీక్వెల్‌ మూవీ: హీరోని మార్చిన డైరెక్టర్‌)

(చదవండి: రాజమౌళి-మహేష్‌ మూవీ స్టార్ట్‌ అయ్యేది అప్పుడేనా!)

మరిన్ని వార్తలు