ర్యాంబోలో టైగర్‌కి బదులుగా ప్రభాస్?‌

3 Apr, 2021 19:38 IST|Sakshi

 సిద్దార్థ్ ఆనంద్‌ దర్శకత్వంలో టైగర్‌ ష్రాఫ్‌ కథానాయకుడిగా ‘రాంబో’ సినిమా చేస్తున్నట్లు మూడేళ్ల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే.  కొన్ని కారణాల వల్ల ‘రాంబో’  టైగర్‌ కి బదులుగా ప్రభాస్‌ నటించనున్నాడనే వార్తలు ప్రస్తుతం బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.‌ సిల్వెస్టర్ స్టలోన్ హీరోగా నటించిన ‘రాంబో’ చిత్రానికి రిమేక్‌. టైగర్‌ ష్రాఫ్‌ ‘వార్‌’ చిత్రం తర్వాత రాంబోని పట్టాలెక్కించాలని దర్శకుడు‌ భావించాడు. అయితే టైగర్‌ గణపథ్ పార్ట్ 1 ,2, హీరోపంటి 2, బాఘి 4లకు ఇంతకు ముందే డేట్స్‌ ఇచ్చేశాడు. ఇక తన బిజీ షెడ్యూల్‌ చూస్తే వచ్చే ఏడాది చివరి వరకు డేట్స్‌ దాదాపుగా ఖాళీ లేనట్టే కనపడుతోంది.

ఈ కారణంగా ‘రాంబో’ కోసం కాల్షీట్స్ని సర్దుబాటు చేయలేకపోతున్నాడు. ఇప్పటికే సినిమా ప్రకటించి చాలా కాలం గడవడంతో దీని ప్రభావం సినిమాపైన పడుతుందని చిత్ర దర్శకుడు భావిస్తున్నాడు. దాంతో  ప్రభాస్‌ని ‘రాంబో’ సినిమా కోసం సిద్ధార్థ్ సంప్రదించాడట. వారు చెప్పిన కథ కూడా నచ్చడంతో ప్రభాస్‌ ఈ ప్రాజెక్ట్‌‌ చేసేందుకు సుముఖంగా ఉన్నట్టు సమాచారం‌. పైగా  ప్రభాస్ నటిస్తే  ఈ చిత్రం పాన్-ఇండియా ప్రాజెక్టుగా మారుతుందని, అది సినిమాకు ప్లస్‌ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

ప్రస్తుతం టైగర్ లానే ప్రభాస్‌ కూడా వరుస సినిమాలతో కాల్‌ షీట్స్‌ ఖాళీ లేకుండా బీజీబిజీగా గుడుపుతున్నాడు. మరి ఈ కాంబో కుదిరి ‘రాంబో’ గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే మరి.  ( చదవండి: వామ్మో 'ఆర్‌ఆర్‌ఆర్'‌‌కు ఓ రేంజ్‌లో బిజినెస్‌! )

మరిన్ని వార్తలు