Will Smith: హాలీవుడ్‌ ఫిల్మ్‌ అకాడమీకి విల్‌ స్మిత్ రాజీనామా..

2 Apr, 2022 08:49 IST|Sakshi

Will Smith Resigns: హాలీవుడ్‌ స్టార్‌ హీరో, ఆస్కార్ విన్నర్ విల్‌ స్మిత్‌ అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ (అకాడమీ అవార్డ్స్‌)కు రాజీనామా చేశాడు. ప్రముఖ అమెరికన్‌ కమెడియన్‌ క్రిస్‌ రాక్‌పై చేయి చేసుకోవడంపై విల్‌ స్మిత్‌ శుక్రవారం (ఏప్రిల్‌ 1) ఈ విధంగా తెలిపాడు. క్రిస్‌ రాక్‌ను చెంప దెబ్బ కొట్టండ అనేది 'షాకింగ్‌, బాధాకరమైనది, క్షమించరానిది' అని పేర్కొన్నాడు. 'నేను అకాడమీ నమ్మకానికి ద్రోహం చేశాను. ఈ వేడుకను అద్భుతమైన ప్రతిభ కనబర్చిన ఇతర నామినీలు, విజేతలు సంతోషంగా జరుపుకునే అవకాశాన్ని నేను కోల్పోయేలా చేశాను, నేను పోగొట్టుకున్నాను. నా గుండె ముక్కలైంది (హార్ట్‌ బ్రోకేన్‌). కాబట్టి, నేను అకాడమీ అవార్డ్స్‌ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. బోర్డు తీసుకునే ఏ చర్యలకైనా సిద్ధమే. తదుపరి పరిణామాలను అంగీకరిస్తాను.' అని స్మిత్‌ ఒక ప్రకటనలో తెలిపాడు.

చదవండి: ఆస్కార్‌ విన్నర్‌ విల్‌ స్మిత్‌ భార్యకు ఉన్న వ్యాధి లక్షణాలు ఇవే..

అంతేకాకుండా 'మార్పుకు సమయం పడుతుంది. హింసను అనుమతించకుండా, అందుకు కారణమయ్యే పరిస్థితులను అధిగమించేలా నా పనికి నేను కట్టుబడి ఉంటాను.' అని విల్‌ చెప్పుకొచ్చాడు. విల్‌ స్మిత్‌ రాజీనామాను ఆమోదించినట్లు అకాడమీ అవార్డ్స్‌ ప్రెసిడెంట్‌ డేవిడ్‌ రూబిన్‌ తెలిపారు. క్షమశిక్షణా చర్యలో భాగంగా అదనపు ఆంక్షలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్ 18న జరిగే గ్రూప్ బోర్డు సమావేశంలో ఈ విషయం గురించి చర్చించనున్నారు. అయితే గత ఆదివారం జరిగిన ఆస్కార్‌ వేడుకలో కమెడియన్‌ క్రిస్‌ రాక్‌ హోస్ట్‌గా వ్యవహరించాడు. కార్యక్రమంలో భాగంగా ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డును ప్రకటించాడనికి ముందు వీక్షకుల్ని నవ్వించే ప్రయత్నం చేశాడు. 

చదవండి: విల్‌ స్మిత్‌ ఇంటికి పోలీసులు.. కారణం అదేనా ?

'అలోపేసియా' వ్యాధి కారణంగా జుత్తు కోల్పోయిన విల్‌ స్మిత్‌ భార్య జాడా పింకెట్‌ను ఉద్దేశించి జోక్‌ చేశాడు వ్యాఖ్యాత క్రిస్‌ రాక్‌. దీంతో ఆగ్రహానికి లోనైనా విల్‌ స్మిత్‌.. క్రిస్‌ రాక్‌ చెంప చెల్లుమనించిన సంగతి తెలిసిందే. తర్వాత ఆస్కార్‌ అందుకునే సమయంలో అకాడమీ నిర్వాహకులకు, నామినీలకు, తర్వాతి రోజు ఇన్‌స్టా గ్రామ్‌లో క్షమాపణలు కూడా తెలిపాడు విల్‌. అకాడమీ చర్యల్లో భాగంగా విల్ స్మిత్‌ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. 
 

మరిన్ని వార్తలు