Gina Lollobrigida: ప్రపంచంలోనే అందమైన నటి ఇకలేరు

17 Jan, 2023 19:12 IST|Sakshi

ప్రపంచంలోనే అందమైన నటిగా పేరుగాంచిన తార ఇకలేరు. ఇటాలియన్ వెండితెర రాణిగా వెలుగొందిన జినా లొల్లో బ్రిగిడా(95) ఇవాళ కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు. ఈ విషయాన్ని ఇటాలియన్ వార్తా సంస్థ అన్సా ధృవీకరించింది. దీంతో హాలీవుడ్ సినీ ప్రముఖులు ఆమెకు సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

 హాలీవుడ్‌లో 'బ్రెడ్, లవ్ అండ్ ఫాంటసీ' సినిమాలో తన పాత్రకు బాగా ప్రసిద్ది చెందింది. 1950వ దశకంలో మోస్ట్ బ్యూటిఫుల్​ ఉమెన్​ ఇన్​ ది వరల్డ్‌గా పేరు సంపాదించింది. ఫ్రాంక్ సినాట్రా, హంఫ్రీ బోగార్ట్, మార్సెల్లో మాస్ట్రోయాని లాంటి నటులతో 60కి పైగా చిత్రాలలో నటించింది. 1960 తర్వాత రాజకీయాల్లోకి వెళ్లడంతో కెరీర్ నెమ్మదించింది. జినా ఇటలీలోని సుబియాకోలోని సంపన్న కుటుంబంలో 1927లో జన్మించింది. చదువు కోసం 20 సంవత్సరాల వయస్సులో రోమ్‌కి వెళ్లింది. ఆమె సినిమాల్లో నటనకు అనేక అవార్డులను గెలుచుకుంది.

మరిన్ని వార్తలు