శేఖర్‌ కమ్ములకు కోపం వస్తే... సీక్రెట్‌ చెప్పిన చై.. నవ్వులే నవ్వులు

18 May, 2021 10:44 IST|Sakshi

శేఖర్‌ కమ్ముల  గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన సాయి పల్లవి, నాగ చైతన్య

సెన్సిబుల్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌ స్టోరీ’. ఏప్రిల్‌ 16న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఖాలీ సమయంలో దొరకడంతో ఈ మూవీ ప్రమోషన్స్‌ మొదలెట్టాడు శెఖర్‌ కమ్ముల. అందులో భాగంగా హీరో రానా  హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘నం.1 యారి’షోలో ‘లవ్‌స్టోరీ’ టీమ్‌ సందడి చేసింది.

ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో ప్రసారమయ్యే ఈ షోలో శేఖర్‌ కమ్ముల గురించి హీరో చైతన్య, హీరోయిన్‌ సాయిపల్లవి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సెట్‌లో ఆయన ఎలా ఉంటాడు. కోపం వస్తే ఏం చేస్తాడు తదితర విషయాలను బయటపెట్టారు. శేఖర్‌ కమ్ముల ప్రత్యేక ఏంటని సాయిపల్లవిని అడగ్గా.. ఆయన విషయంలో తాను కొంచెం పొసెసీవ్‌ అని చెప్పింది. నేను సెట్‌లో ఉన్నప్పుడు ఎప్పుడైనా చైని మెచ్చుకుంటే నేను శేఖర్‌ కమ్ములగారి వైపు కోపంగా చూస్తుంటా. అసలు నాకు సంబంధం లేని విషయాల్లో కూడా ఆయనకు సలహాలు ఇస్తాను. ఆయన దానికి ఎలా స్పందిస్తారా..? అని ఎదురుచూస్తుంటా’అని సాయిపల్లవి చెప్పింది.

ఇక శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ.. తాను ఎవరిని ఎక్కువగా పొగడనని, గుడ్‌ అని చెప్పానని, నచ్చకపోతే మానిటర్‌ దగ్గర నుంచి వెళ్లిపోతానని శేఖర్‌ చెబుతుండగా నాగచైతన్య కల్పించుకొని ‘దాదాపు గుడ్‌ అంటారు. ఈ మధ్య ‘యాక్‌’అనే పదం కూడా నేర్చుకున్నాడు’ అని అనడంలో అంతా ఘొల్లున నవ్వారు. ఇక రానా స్పందిస్తూ.. ఇది కొత్త పదం అని, తాను మాత్రం ‘యాక్‌’ అనిపించుకునేంత దారుణంగా ఎప్పుడూ చేయలేదనడంతో షోలో నవ్వులు పూశాయి. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు