Yami Gautam - Neha Dhupia: మహిళల కోసం ఢిల్లీ కమిషన్‌ మెట్లెక్కిన హీరోయిన్లు

12 Mar, 2022 14:06 IST|Sakshi

Yami Gautam Neha Dhupia Visit Delhi Commission For Women: బాలీవుడ్​ ముద్దుగుమ్మ యామీ గౌతమ్​ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. నితిన్​ సరసన కొరియర్​ బాయ్​ కల్యాణ్​, గౌరవం, నువ్విలా తదితర చిత్రాల్లో నటించి టాలీవుడ్​ ఆడియెన్స్​కు చేరువైంది. బీటౌన్‌లో మంచి గుర్తింపు పొందిన ఈ అమ్మడు తాజాగా నటించిన చిత్రం 'ఏ థర్స్‌డే' మంచి విజయాన్ని సాధించింది. ఇందులో లైంగిక వేధింపులకు గురైనా బాధితురాలి పాత్రలో నటించి ప్రేక్షకులతోపాటు విమిర్శకులను సైతం మెప్పించింది యామీ గౌతమ్‌. అంతేకాకుండా నిజ జీవితంలో కూడా అత్యాచార వేధింపులకు గురైన మహిళల భద్రత కోసం, వారికి పునరావాసం కల్పించేందుకు మజ్లీస్‌, పారి పీపుల్‌ ఎగైనెస్ట్‌ రేప్ ఇన్‌ ఇండియా అనే రెండు ఎన్‌జీవో సంస్థలతో కలిసి పనిచేస్తోంది. 

చదవండి: సినిమాలో ఆ పాత్ర.. ఇప్పుడు వారి కోసం రియల్ లైఫ్​లో ఇలా

ఈ క్రమంలోనే యామీ గౌతమ్‌ ఢిల్లీ మహిళా కమిషన్‌ కార్యాలయానికి వెళ్లింది. ఆమెతోపాటు సినిమాలోని తనతోపాటు నటించిన హీరోయిన్‌ నేహా ధూపియా కూడా ఉంది. వీరిద్దరూ కలిసి ఢిల్లీ మహిళా కమిషన్‌ను సందర్శించారు. కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌తోపాటు ఇతర అధికారులతో చర్చించారు. ఢిల్లీలో మహిళల భద్రత, భరోసా కోసం వారు చేపట్టిన వివిధ కార్యాక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు.  అంతేకాకుండా మహిళలపై హింసకు సంబంధించిన ఫిర్యాదులు నమోదు చేసేందుకు ఉన్న 181 హెల్ప్‌లైన్‌ నంబర్‌, దాని పనితీరు గురించి వివరంగా  తెలుసుకున్నారు. 

చదవండి: అది యాక్సెప్ట్ చేయడానికి ఏళ్లు పట్టింది.. హీరోయిన్‌ ఎమోషనల్ పోస్ట్‌

ఈ హెల్ప్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు అందిన వెంటనే సత్వర చర్యలు తీసుకునేందుకు పెట్రోల్‌ వ్యాన్‌లు పంపిస్తారని తెలిసి సంతోషం వ్యక్తం చేశారు. తన సినిమాలో చూపించినట్లు మహిళల భద్రత కోసం చేసిన కఠినమైన చర్యలు తీసుకోవడం ఆనందంగా ఉందని యామీ తెలిపారు. ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్‌, ఇతర అధికారులను కలవడం సంతోషంగా ఉందన్నారు. మహిళల భద్రత కోసం ఈ బృందం చూపిన చొరవపట్ల అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌లో షేర్‌ చేశారు యామీ గౌతమ్‌. కాగా యామీ గౌతమ్‌, నేహా ధూపియా నటించిన 'ఏ థర్స్‌డే' చిత్రం ఫిబ్రవరి 17 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్టీమింగ్‌ అవుతోంది. 
 

A post shared by Yami Gautam Dhar (@yamigautam)

మరిన్ని వార్తలు