గాయాన్ని జయించిన యామీ గౌతమ్‌..

23 Aug, 2020 19:22 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటి యామీ గౌతమ్‌ గత కొద్ది కాలంగా తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతుంది. కాగా మెడ నొప్పిని తగ్గించుకోవడానికి యోగా చేశానని తెలిపారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ వల్ల తన శరారీక, మానసిక ఫిట్‌నిస్‌పై శ్రద్ధ వహించినట్లు పేర్కొన్నారు. కాగా తన శరీరాన్ని అంతర్గతంగా నయం అయ్యే విధంగా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. తన గాయాన్ని దృష్టిలో ఉంచుకొని శ్రద్ధ వహించానని, అంతిమంగా నొప్పిని జయించి సాధారణ జీవితాన్ని గడుపుతున్నట్లు పేర్కొన్నారు.

తన తదుపరి సినిమా గిన్నీ వెడ్స్‌ సన్నీ ద్వారా త్వరలో ప్రేక్షకుల ముందుకు యామీ గౌతమ్‌ రానున్నారు. కాగా యామీ మొదట్లో ఫెయిర్‌ అండ్‌ లవ్లీ యాడ్‌తో అందరిని ఆకట్టుకుంది. మొదట సీరియల్‌ నటిగా తర్వాత మోడల్‌గా, అనంతరం హీరోయిన్‌గా కెరీర్‌లో దూసుకెళ్తుంది. కాగా ఇటీవల బాలా చిత్రం ద్వారా యామీ గౌతమ్‌ మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే.
చదవండి: అందులో తప్పేముంది? : నటి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు