కేజీఎఫ్‌ ‘గరుడ’ ఎవరో తెలుసా..?!

5 Jan, 2021 18:31 IST|Sakshi

కేజీఎఫ్చిత్రం కన్నడ పరిశ్రమతో పాటు.. భారతీయ సినీ చరిత్రలో పలు రికార్డులు నెలకొల్పింది. ఈ సినిమాతో రాకీ భాయ్‌ యశ్‌ దేశవ్యాప్తంగా గుర్తింపుతో పాటు, అభిమానులను సంపాదించుకున్నారు. యశ్‌తో పాటు ఈ చిత్రంలో నటించిన అందరికి మంచి గుర్తింపు లభించింది. ఇక సినిమాలో విలన్‌ ఎంత బలవంతుడైతే హీరోకి అంత ఎక్కువ గుర్తింపు దక్కుతుందనే విషయం ఈ సినిమాతో మరో సారి రుజువయ్యింది. రాకీ పాత్రకు ధీటుగా మెయిన్‌ విలన్‌ ‘గరుడ’ పాత్ర కూడా అంతే బాగా ఫేమస్‌ అయ్యింది. ఇక చిత్రంలో ‘గరుడ’ పాత్ర పోషించిన వ్యక్తికి సంబంధించి ఆసిక్తకర విషయం ఒకటి ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతుంది. కేజీఎఫ్‌ 1లో ‘గరుడ’ పాత్ర పోషించిన వ్యక్తి పేరు రామ్‌. వాస్తవానికి అతడు నటుడు కాదు. యశ్కు బాడీగార్డ్‌.. ఎంతో కాలం నుంచి సన్నిహితుడు. ఇక వీరిద్దరూ ఏదైనా చిత్రంలో కలిసి నటించాలని భావించారట. కేజీఎఫ్‌తో ఇద్దరి కల ఒకేసారి నెరవేరింది. (చదవండి: ప్ర‌కాశ్ రాజ్ ఆ పాత్ర చేయ‌డం లేదు!)

ఇక ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్‌ నీల్ కథ గురించి యశ్‌తో చర్చిండానికి వెళ్లినప్పుడు అక్కడ రామ్‌ని చూశారు. ‘గరుడ’ పాత్రకు సరిపోతాడని భావించి.. ఆడిషన్స్‌కి రావాల్సిందిగా కోరారు. సెలక్ట్‌ కావడంతో గరుడ పాత్రకు తగ్గట్టు మారడం కోసం ఇక రామ్‌ జిమ్‌లో కసరత్తులు ప్రారంభించాడట. అతడి డెడికేషన్‌కి ముచ్చటపడిన ప్రశాంత్‌ ‘గరుడ’ పాత్రకి రామ్‌నే ఫైనల్‌ చేశారు. ఇక ఓ ఇంటర్వ్యూలో రామ్‌ మాట్లాడుతూ.. ‘కేజీఎఫ్‌ 1లో నేను కూడా నటించానని గుర్తుకు వస్తే ఎంతో థ్రిల్లవుతాను. ఈ సినిమాకి నేను సెలక్ట్‌ అవుతానని కానీ.. ఇంత మంచి పాత్ర చేస్తానని కానీ కల్లో కూడా ఊహించలేదు. సినిమా విడుదలయ్యాకే నా పాత్ర ఎంత కీలకమైందో తెలిసింది’ అన్నారు. ఇక కేజీఎఫ్‌ సక్సెస్‌తో రామ్‌ ప్రస్తుతం బిజీ ఆర్టిస్ట్‌ అయ్యారు. ప్రస్తుతం దక్షిణాదిలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీటిలో కార్తి సుల్తాన్‌ సినిమా ప్రధానమైంది. అలానే ఓ తెలుగు సినిమాలో కూడా నటిస్తున్నట్లు సమాచారం. (థాంక్యూ డియర్‌ హజ్బెండ్‌: రాధిక)

ఇక 2018లో విడుదలైన కేజీఎఫ్‌ కన్నడ చిత్ర పరిశ్రమలో రికార్డు స్థాయి కలెక్షన్‌లు సాధించింది. ఏకంగా 250 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక హిందీలో డబ్‌ అయిన కన్నడ చిత్రాల్లో అత్యధిక వసూల్లు సాధించిన చిత్రంగానే కాక పాకిస్తాన్‌లో విడుదలైన తొలి కన్నడ చిత్రంగా కూడా రికార్డు క్రియేట్‌ చేసింది. ఇక ప్రస్తుతం కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 షూటింగ్‌ జరుగుతుంది. ఇక రెండవ భాగంలో సంజయ్‌ దత్‌, ప్రకాశ్‌ రాజ్‌, రవీనా టాండన్‌ కీలక పాత్రల్లో నటిస్తుండటంతో కేజీఎఫ్‌ చాప్టర్‌ 2పై భారీ అంచనాలే ఉన్నాయి. జనవరి 8న కేజీఎఫ్‌2 టీజర్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు