మీరు నిజమైన యోధుడు.. వేచి ఉండలేను: యష్‌

16 Oct, 2020 15:25 IST|Sakshi

త్వరలో ‘కేజీఎఫ్‌-2’ చిత్రం షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టుకు కన్నడ రాక్‌స్టార్‌ హీరో యష్‌ స్పందిచాడు. ఇటీవల ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారిన పడ్డ సంజయ్‌ దుబాయ్‌లో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం ముంబైకి తిరిగి రాగానే తన ఫొటోలను షేర్‌ చేస్తూ.. నవంబర్‌లో ‘కేజీఎఫ్‌-2’ షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు చెప్పారు. a పోస్టుకు యష్‌.. సంజయ్‌ని సెట్స్‌కు స్వాగతిస్తూ నిజమైన యోధుడు అని వ్యాఖ్యానించాడు. (చదవండి: అధీరా వస్తున్నాడు)

‘నిజమైన యోధుడి సంకల్పాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఏది ఆపలేదు.. మీరు తిరిగి షూటింగ్‌లో పాల్గొనబోతున్నందుకు చాలా సంతోషం​. ఇక నేను వేచి ఉండలేను’ అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. యష్‌ హీరోగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న ‘కేజీయఫ్‌ 2’.లో సంజయ్‌ దత్‌ మెయిన్‌ విలన్‌గా అధీరా పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో సంజయ్‌ భారీ యాక్షన్‌ సన్నివేశాల్లో నటించనున్నాడు. కన్నడ ప్యాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సినీయర్‌ నటి రవీనా టాండన్‌ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. (చదవండి: రాఖీ బాయ్‌ ఈజ్‌ బ్యాక్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు