యశ్‌తో భారీ‌ మల్టీస్టారర్‌కు శంకర్‌ ప్లాన్‌‌

6 Nov, 2020 19:58 IST|Sakshi

అప్పటివరకు టాలీవుడ్‌, బాలీవుడ్‌ సినిమాలు మాత్రమే ఇండస్ట్రీని ఏలాయి. ఇంతలో దక్షిణ భారతంలో ఓ చిన్న సినీ పరిశ్రమ అందరి చూపు తనవైపు తిప్పుకుంది. అదే శాండల్‌వుడ్‌. అప్పటివరకు కన్నడ సినిమాల గురించి పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఆ ఒక్క సినిమా శాండల్‌వుడ్‌ స్థాయినే మార్చేసింది. అదే కేజీఎఫ్‌.. కళ్లు చెదిరే గ్రాఫిక్స్‌ లేవు, ఫేమస్‌ హీరో కాదు, బ్లాక్‌బస్టర్‌ హిట్‌లు కొట్టిన డైరెక్టర్‌ కాదు. ​కానీ మూవీతో ఏదో మ్యాజిక్‌ చేశాడు. అంతే మూవీ లవర్స్‌ అందరూ శాండల్‌వుడ్‌లో కంటెంట్‌ ఉంది అనుకోవడం మొదలుపెట్టారు. అందుకే కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇంత క్రేజ్‌ దక్కించుకున్నాడు కాబట్టే హీరో యశ్‌ తమిళంలో భారీ బడ్జెట్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రెస్‌ అయిన శంకర్‌ సినిమాలో నటించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇండియన్-‌2 సినిమా సెట్‌లో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత షూటింగ్‌కు కొంతకాలం బ్రేక్‌ పడింది. అందుకే దాన్ని పక్కన పెట్టి అప్పటిలోపు ఒక మల్టీస్టారర్‌ సినిమా తీద్దామన్న ఆలోచనలో ఉన్నాడట శంకర్‌. అందులో ఒక హీరోగా యశ్‌ను అనుకున్నాడని, దీనికి యశ్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని సమాచారం. కమల్‌ హాసన్‌ కూడా దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌తో తన తర్వాత సినిమా ఉండబోతుందని ప్రకటించాడు కాబట్టి ఇండియన్-‌2 షూటింగ్‌ సంగతి కనుమరుగయినట్టే అని తెలుస్తోంది. అందుకే ఇండియన్-‌2 గురించి క్లారిటీ వచ్చేలోపు మల్టీస్టారర్‌ను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మల్టీస్టారర్‌కి క్రేజ్‌ రావాలని పలు ఇండస్ట్రీల నుంచి భారీ తారాగణాన్ని దింపాలని శంకర్‌ ప్లాన్‌.     (13 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి బొమ్మరిల్లు)

అందుకే కేజీఎఫ్‌తో శాండల్‌వుడ్‌లోనే కాక దేశవ్యాప్తంగా క్రేజ్‌ సంపాదించుకున్న యశ్‌ని ఎంచుకున్నాడు. దీనికి యశ్‌ కూడా అంగీకరించాడు. ఇంకో కీలక పాత్ర కోసం విజయ్‌ సేతుపతిని సంప్రదిస్తున్నారు. ఈ మల్టీస్టారర్‌ని ఒకేసారి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారు. కేజీఎఫ్ ‌2 షూటింగ్‌లో ఉన్న యశ్‌ డిసెంబర్‌ వరకు ఇందులోనే బిజీగా గడపనున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే శంకర్‌, యశ్‌ కాంబినేషన్‌లో సినిమా 2021 జనవరిలో సెట్స్‌పైకి వెళ్లనుంది.   (శ్యామ్‌ సింగరాయ్‌లో విలన్‌గా‌ నారా రోహిత్‌)

ఫిబ్రవరిలో ఇండియన్-‌2 సినిమా సెట్‌లో జరిగిన ప్రమాదం తర్వాత ఆ షూటింగ్‌ ఆగిపోయింది. భారీ లైట్‌తో ఉన్న క్రేన్‌ కూలిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, మరో 10 మందికి గాయాలయ్యాయి. దీని నుంచి కాజల్‌ అగర్వాల్‌, కమల్‌ హాసన్‌ తృటిలో తప్పించుకున్నారు. ఇందులో మరణించిన వారి కుటుంబాలకు రూ.కోటి అందజేయాలని మూవీ టీమ్‌ నిర్ణయించుకుంది. వారికి ఇచ్చిన మాట ప్రకారం ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా(ఎఫ్‌ఈఎఫ్‌ఎస్‌ఐ) అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి గురువారం వారి కుటుంబాలకు చెక్‌లను అందజేశారు. వారితో పాటు ప్రమాదంలో గాయపడిన టెక్నిషియన్‌ రామరాజన్‌కి కూడా 90లక్షలు పరిహారాన్ని ఇచ్చింది మూవీ టీమ్‌. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు