యశ్‌కు జోడీ కుదిరిందా?

19 Jun, 2021 00:11 IST|Sakshi
యశ్‌, తమన్నా

‘కేజీఎఫ్‌’ చిత్రంతో హీరోగా దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు కన్నడ స్టార్‌ యశ్‌. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం యశ్‌–ప్రశాంత్‌ ‘కేజీఎఫ్‌ 2’ చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత కన్నడ డైరెక్టర్‌ నార్తన్‌ తెరకెక్కించనున్న చిత్రంలో యశ్‌ ఓ సినిమా చేయనున్నారట. ఈ చిత్రంలో పవర్‌ఫుల్‌ అండ్‌ యాంగ్రీ ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో కనిపిస్తారట యశ్‌.

ఇందులో హీరోయిన్‌గా తమన్నాని తీసుకోవాలనుకుంటున్నారని సమాచారం. యశ్‌ ‘కేజీఎఫ్‌’ మొదటి భాగంలో తమన్నా ఓ స్పెషల్‌ సాంగ్‌ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. నార్తన్‌ దర్శకత్వంలో యశ్‌ చేయనున్నది ప్యాన్‌ ఇండియా సినిమా కావడంతో ఇటు దక్షిణాది అటు ఉత్తరాది భాషల్లో మంచి గుర్తింపు ఉన్న తమన్నా అయితే కథానాయికగా బాగుంటుందని భావించారట. మరి... యశ్, తమన్నాల జోడీ కుదురుతుందా? అధికారిక ప్రకటన వస్తేనే తెలుస్తుంది. 

మరిన్ని వార్తలు