Yashoda Movie In OTT: ఓటీటీలోకి ‘యశోద’ వచ్చేది అప్పుడేనా?

22 Nov, 2022 18:51 IST|Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య నవంబర్‌ 11 థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌తో డీసెంట్‌ హిట్‌గా నిలిచింది. సమంత నటనపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. అయితే బాక్సాఫీస్‌ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టలేకపోయిందని టాలీవుడ్‌ టాక్‌.

(చదవండి: ఓటీటీకి 'కాంతార'.. ఆ వివాదం వల్లే ఆలస్యమవుతోందా ?)

ఇదిలా ఉంటే.. ఈ చిత్రం ఓటీటీ అప్‌డేట్‌ ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ‘యశోద’ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ రెండో వారంలో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.అయితే దీనిపై ఇంకా అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. సరోగసీ నేపథ్యంలో థ్రిల్లర్‌ కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా, ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. 

మరిన్ని వార్తలు