కేజీఎఫ్‌ చాప్టర్‌-2 వచ్చేస్తుంది..సలార్‌ వాయిదా పడనుందా?

22 Aug, 2021 19:08 IST|Sakshi

యష్‌ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన  కేజీఎఫ్ మొదటి భాగం ఎంతటి సూపర్‌ హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ ఒక్క సినిమాతో యష్‌ ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయాడు. ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

తాజాగా ఈ సినిమాను 2022 ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు దర్శకుడు  ప్రశాంత్ నీల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఇక సీక్వెల్‌లో యష్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. సంజయ్‌ దత్‌ విలన్‌గా కనిపించనున్నారు. రవీనా టాండన్, రావు రమేష్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. 

అయితే ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే..కేజీఎఫ్‌-2 రిలీజ్‌ డేట్‌ రోజే ప్రభాస్‌ నటిస్తున్న సలార్‌ కూడా విడుదల కానుందని గతంలో చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాను కూడా డైరెక్టర్‌గా ప్రశాంత్‌ నీల్‌ వ్యవహరిస్తున్నారు. దీంతో రెండు భారీ బడ్జెట్‌ సినిమాలు ఒకేరోజు విడుదల అవుతాయా? లేదా సలార్‌ వాయిదా పడనుందా అన్నది తేలాల్సి ఉంది. 

చదవండి : టైగర్‌ 3 కోసం పూర్తిగా మారిపోయిన సల్మాన్‌.. ఫొటోలు లీక్‌
Chiru154 : పూనకాలు లోడింగ్‌.. అదిరిపోయిన పోస్టర్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు