యాత్ర- 2 నుంచి సాంగ్‌.. సీఎం జగన్‌ పాదయాత్రను మరోసారి చూసేయండి

12 Feb, 2024 13:10 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన సినిమా యాత్ర. 2019లో వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన యాత్ర 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహి వి రాఘవ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌గా కొనసాగుతుంది.

స్టార్‌ హీరోకు ఉన్నంత క్రేజ్‌ ఒక పొలిటికల్‌ బయోపిక్‌కు రావడం అంత సులభం కాదు. ముఖ్యంగా ఈ సినిమాలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆయన తనయుడు జగన్‌మోహన్‌ రెడ్డి పాత్రలు కనిపించడంతో అందరూ థియేటర్‌లకు వెళ్తున్నారు. తమ కళ్ల ముందు జరిగిన సంఘటనలను ఉన్నది ఉన్నట్లుగా తీశారని ప్రేక్షకులు తెలుపుతున్నారు.

యాత్ర 2లో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009-2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాను రియల్‌స్టిక్‌గా డైరెక్టర్‌ తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా నుంచి 'భగ భగ మండే సూర్యుడు రా..' అనే సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. గతంలో సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి గారు సుమారు 10 ఏళ్ల పాటు ప్రజల్లో తిరిగారు. ఆయన కొనసాగించిన పాదయాత్రలో లక్షలాదిమంది ప్రజలు భాగం అయ్యారు. వాటిలోని కొన్ని విజువల్స్‌ ఈ పాటలో కనిపిస్తాయి. మరోకసారి వాటిని చూసిన అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega