ఈ పంచ్‌ డైలాగ్స్‌పై ఓ లుక్కేసి.. 2022కి బైబై చెప్పండి

31 Dec, 2022 08:26 IST|Sakshi

2022 ఎండ్‌ అవుతోంది... ఈ ఎండింగ్‌ హ్యాపీకి దారి తీయాలంటూ 2023కి వెల్‌కమ్‌ చెప్పడానికి రెడీ అవుతున్నాం. ఈ ఇయర్‌ ఎండింగ్‌ని కొన్ని పంచ్‌ డైలాగ్స్‌తో ఎండ్‌ చేద్దాం. 2022లో రిలీజైన చిత్రాల్లో పాపులర్‌ డైలాగ్స్‌ చాలా ఉన్నాయి. వాటిల్లో కొన్ని  పంచ్‌ డైలాగ్స్, లవ్‌ డైలాగ్స్, కామెడీ డైలాగ్స్, ఎమోషనల్‌ డైలాగ్స్‌ ఈ విధంగా ...

బంగార్రాజు: ఏంటే ఈ మనుషులు.. బతికున్నప్పుడు ప్రాణం విలువ తెలీదేంటే వీళ్లకి.. పోతేనే తెలుస్తుందా? నాకు తెలుసే దాని విలువ.. చిన్న చిన్న గొడవల కోసం ఎందుకే జీవితాంతం కొట్టుకుని చస్తారు.. బతికున్నప్పుడే కదా ఈ ప్రేమలు.. పోయాక ఏం మిగులుతుందే.. ఫొటోలు తప్ప.  

గుడ్‌ లక్‌ సఖి: గోలీ రాజు ఏంటి గోలీ రాజు? స్టేజి మీద నా పేరు రామారావు.. నువ్వు రామారావు అయితే నేను సావిత్రి.  

ఆర్‌ఆర్‌ఆర్‌:  తొంగి తొంగి నక్కి నక్కి కాదే.. తొక్కుకుంటూ పోవాలే.. ఎదురొచ్చినోణ్ణి ఏసుకుంటూ పోవాలే 
భీమ్‌... ఈ నక్కల వేట ఎంత సేపు. కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పదా?  

ఖిలాడి: ఎప్పుడూ ఒకే టీమ్‌కి ఆడటానికి నేషనల్‌ ప్లేయర్‌ని కాదు.. ఐపీఎల్‌ ప్లేయర్‌. ఎవడెక్కువ పాడుకుంటే వాడికే ఆడతాను.
 
డీజే టిల్లు: ఇంట్లో ఒక శవాన్ని, బిల్డింగ్‌లో సీసీ టీవీ కెమెరాల్ని పెట్టుకుని కూడా నువ్వు నన్ను పేరంటానికి పిలిచినట్టు పిలిస్తే నేను మొహానికి పౌడర్‌ కొట్టుకుని వచ్చేసినా చూడు అట్లుంటది మనతోని ముచ్చట.  

సన్‌ ఆఫ్‌ ఇండియా: నేను చీకటిలో ఉండే వెలుతురిని.. వెలుతురులో ఉండే చీకటిని.. నేను కసక్‌ అంటే మీరందరూ ఫసక్‌. 

ఆడవాళ్ళు మీకు జోహార్లు: వీకెండ్‌ అంటే ఏం ఉంటుందండి.. తాగటం, తినడం, తొంగోవడం.. అలా అందరిలా కాకుండా అంతర్వేది, అన్నవరం వెళ్లొద్దామనుకుంటున్నానండి.  

రాధేశ్యామ్‌: ఏంట్రా.. నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా?, ఆడు ప్రేమ కోసం చచ్చాడు.. నేను ఆ టైపు కాదు.   

ఆచార్య: పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు.. బహుశా గుణపాఠాలు చెబుతాననేమో?  
ఆపదొస్తే ఆ అమ్మోరు తల్లే మాలో ఆవహించి ముందుకు పంపుద్ది.. ధర్మస్థలి అధర్మస్థలి కాకూడదు. 

సర్కారువారి పాట: మీరు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నారనే విషయం మర్చిపోవద్దు. 
♦ దీనికున్న అలవాట్లకి, దీనికున్న వ్యసనాలకి అమ్మాయి అంటారా దీన్ని.  

ఎఫ్‌3: వాళ్లది మరాఠీ ఫ్యామిలీ అయితే మాది దగ్గుబాటి ఫ్యామిలీ 
♦ వాళ్లది దగా ఫ్యామిలీ అయితే మాది మెగా ఫ్యామిలీ 

మేజర్‌: టైమ్‌కి మనం వెళ్లకపోవడం వల్ల ఒక్క ప్రాణం కోల్పోయినా కూడా లైఫ్‌లో నన్ను నేను సోల్జర్‌ అనుకోలేను సర్‌.  

పక్కా కమర్షియల్‌: సెల్యూట్‌ కొట్టించుకోవడానికి నేను హీరోని కాదురా.. విలన్‌.  

ది వారియర్‌: ఒంటి మీద యూనిఫామ్‌ లేకపోయినా రౌండ్‌ ద క్లాక్‌ డ్యూటీలో ఉంటాను.  

థ్యాంక్యూ: లైఫ్‌లో ఇక కాంప్రమైజ్‌ అయ్యేది లేదు.. ఎన్నో వదులుకుని ఇక్కడికొచ్చాను.  

బింబిసార: బింబిసారుడు అంటే మరణ శాసనం.. ఇక్కడ రాక్షసుడైనా, భగవంతుడైనా ఈ బింబిసారుడొక్కడే.   

సీతారామం:  చూడండీ... అడ్రస్‌ దొరికింది కదా అని వచ్చేస్తారేమో? అంత సాహసం మాత్రం చేయకండే! 

కార్తికేయ 2: శక్తి, సామర్థ్యాలతో పాటు బుద్ధి, గుణం వల్లే రాముడు, శివుడు, శ్రీకృష్ణుడు దేవుళ్లయ్యారు.  

లైగర్‌: లోపాలు అందరికీ ఉంటాయి. నీకు నత్తి ఉంది అంటున్నారు కదా.  రేపు నీ మాట కూడా అందరికీ పాట లెక్క వినపడతది.. వినపడేటట్టు చేయాలి.  

గాడ్‌ఫాదర్‌: నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ, నా నుంచి రాజకీయం దూరం కాలేదు.
 
జిన్నా: నమ్మకం లేని ప్రేమ.. కర్రల్లేని టెంటు నిలబడవు రేణుకా.  

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం: అన్యాయంగా బెదిరించేవాడికన్నా న్యాయం కోసం ఎదిరించేవాడే బలమైనవాడు.  

హిట్‌ ది సెకండ్‌ కేస్‌: అవతలి టీమ్‌ వీక్‌ అని మన గోల్‌ కీపర్‌కి రెస్ట్‌ ఇవ్వలేం కదా సర్‌.  

ధమాకా: నేను వెనకున్న వాళ్లను చూసుకుని ముందుకొచ్చినవాణ్ణి కాదురోయ్‌.. వెనక ఎవడూ లేకపోయినా ముందుకు రావొచ్చు అని ఎగ్జాంపుల్‌ సెట్‌ చేసినవాణ్ణి.  

18 పేజెస్‌: ప్రేమించడానికి రీజన్‌ ఉండకూడదు.. ఎందుకు ప్రేమించాం అంటే ఆన్సర్‌ ఉండకూడదు.   

మరిన్ని వార్తలు