భార్య ఫిర్యాదుతో ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్‌

1 Jun, 2021 11:14 IST|Sakshi

ముంబై : ప్రముఖ హిందీ టెలివిజన్‌ నటుడు కరణ్‌ మెహ్రాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గతరాత్రి భార్య నిషా రావల్‌ దాఖలు చేసిన ఫిర్యాదుపై కరణ్‌ను అరెస్ట్‌ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. అయితే ఆ వెంటనే ఆయనకు బెయిల్‌ మంజూరయ్యింది. వివరాల ప్రకారం..యే రిష్‌తా క్యా కెహ్లతా హై సీరియల్‌తో కరణ్‌ మెహ్రా పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఆ సీరియల్‌ ద్వారా విపరీతమైన గుర్తింపు సంపాదిచుకున్న కరణ్‌ ఆ తర్వాత పలు టీవీ షోలలో పాల్గొన్నాడు. చాలా కాలం డేటింగ్‌ అనంతరం 2012 లో కరణ్‌-నిషాలు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. వీరికి కవిష్‌ అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. కరణ్‌-నిషాలు జంటగా  నాచ్‌ బలియే సీజన్‌-5లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా ఉంటున్న వీరి వైవాహిక జీవితంలో గత కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి.


దీంతో వీరిద్దరు విడిపోనున్నారని పలు వార్తలు సోషల్‌ మీడియాలో షికార్లు చేసినా నిషా వాటిని ఖండించింది. తామిద్దరం బాగానే ఉన్నామని, ఇలాంటి వార్తలు అవాస్తవమని తేల్చేసింది. మరోవైపు నటుడు కరణ్‌ గత రెండు వారాల క్రితం కరోనా బారిన పడ్డాడు. ఆ సమయంలో మానసికంగా ఎంతో కుమిపోయానని, అయితే తన భార్య నిషా ఎంతో ధైర్యం చెప్పిందని, తనను చాలా జాగ్రత్తగా చూసుకుందని తెలిపాడు. అయితే అనూహ్యంగా కొన్ని వారాల నుంచి వీరి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. సోమవారం రాత్రి కూడా తమ మధ్య గొడవ జరిగిందని, ఆ  సమయంలో కరణ్‌ తన తలను గోడకు నెట్టేసినట్లు నిషా తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో సెక్షన్‌ 336, 337 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముంబైలోని అతని నివాసంలో కరణ్‌ను అరెస్ట్‌ చేశారు. 

A post shared by ɴɪsʜᴀ ʀᴀᴡᴀʟ (@missnisharawal)

చదవండి : అనుమానాస్పద స్థితిలో ప్రముఖ నటుడి భార్య మృతి..
మా అమ్మ ముందే నిర్మాత అసభ్యంగా మాట్లాడాడు: నటి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు