ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా పన్నికుట్టి

6 Jul, 2022 12:48 IST|Sakshi

అందమైన ఫ్యామిలీ కథా చిత్రంగా వినోదభరితంగా సాగేలా పన్నికుట్టి చిత్రం ఉంటుందని దర్శకుడు అనుచరణ్‌ తెలిపారు. లైకా ప్రొడక్షన్స్‌ సమర్పణలో సూపర్‌ టాకీస్‌ పతాకంపై సమీర్‌ భరత్‌రామ్‌ నిర్మించిన చిత్రం ఇది. యోగిబాబు, కరుణాకరన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఇందులో లక్ష్మీప్రియ నాయకిగా పరిచయం అవుతున్నారు. దిండుకల్‌ లియోని స్వామిజీగా ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి కే సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 8వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది.

ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చిత్ర యూనిట్‌ చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ.. జీవితంలో నిరాశతో కృంగిపోయి దాని నుంచి బయట పడటానికే కామిడీ కథా చిత్రాన్ని తెరకెక్కించాలని భావించానన్నారు. రవి మురుగయ్యా రాసిన కథే ఈ చిత్రం అని తెలిపారు. నిర్మాతకు కథా చెప్పగా నచ్చేసిందని, దిండుకల్‌ లియోని నటించడం సంతోషకరంగా పేర్కొన్నారు. మూగజీవాలను నటింపజేయడం సాధారణ విషయం కాదనీ, చాలా అవరోధాలను ఎదుర్కొని, కొన్ని వ్యూహాలను ఉపయోగించి ఇందులో పందిపిల్లను నటింపజేసినట్లు చెప్పారు. చిత్రం చూసిన తరువాత నమ్మకమే జీవితం అని భావిస్తారని, ప్రేక్షకులు చిత్రం చూసి నవ్వుకుంటూ బయటకు వస్తారని దర్శకుడు తెలిపారు.

మరిన్ని వార్తలు