ముంబైలో మరో యువ నటుడు ఆత్మహత్య

29 Sep, 2020 19:28 IST|Sakshi

ముంబై: ముంబైలో మరో యువ నటుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి తరహాలోనే బుల్లితెర నటుడు అక్షత్‌ ఉత్కర్ష్‌(26) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి ముంబై అంధేరిలోని తన అపార్ట్‌మెంట్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు విడిచాడు. బీహార్‌కు చెందిన ఈ నటుడు కొన్ని భోజ్‌పురి సినిమాల్లో నటించారు. కొన్ని టీవీ సీరియళ్లలో కనిపించగా అనంతరం బాలీవుడ్‌లో అవకాశాలు రావడంతో ముంబైలో స్థిరపడ్డారు. రెండేళ్ల క్రితం ముంబై వచ్చిన అక్షత్‌ అంధేరి వెస్ట్‌లో స్నేహ చౌహాన్‌ అనే యువతితో కలిసి ఉంటున్నాడు. 

ఈ క్రమంలో ఆదివారం రాత్రి నటుడు తన తండ్రికి కాల్‌ చేయగా.. అయితే తాము పౌరాణిక ప్రదర్శన చూస్తున్నందున అతనితో తరువాత మాట్లాడతారని చెప్పారు. అనంతరం కుటుంబ సభ్యులు అక్షత్‌కు ఫోన్‌ చేయగా అతను కాల్‌ తీయలేదు. ఇది జరిగిన కొంత సమయానికి అక్షత్‌ ఆత్మహత్య చేసుకున్నాడని స్నేహ అతని కుటుంబ సభ్యులకు తెలిపింది. 11.30 గంటలకు తను వాష్ రూమ్‌కు వెళ్లిన సమయంలో.. ఉత్కర్ష్ చనిపోయినట్లు గమనించి తమకు సమాచారం అందించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. (పోలీసులకు సోనమ్‌ కపూర్‌ బంధువు ఫిర్యాదు)

కాగా ఇటీవల లాక్ డౌన్ కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఉత్కర్ష్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడని, ఆ ఒత్తిడిని తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే.. ఉత్కర్ష్ మానసిక ఒత్తిడికి లోనయి చనిపోలేదని, అతనిని హత్య చేసి చంపేశారని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు పోస్ట్ మార్టం అనంతరం అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు