Vishwak Sen: నేను ఆ విషయం ఎక్కడా చెప్పలేదు.. అర్జున్‌ వ్యాఖ్యలపై విశ్వక్ సేన్

6 Nov, 2022 22:06 IST|Sakshi

సీనియర్ యాక్టర్ అర్జున్ ఆరోపణలపై టాలీవుడ్ యంగ్ హీరో  విశ్వక్ సేన్ స్పందించారు. రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో హిమాలయాలకు వెళ్దాం అనుకున్నానని సంచలన కామెంట్స్ చేశారు. నేను ప్రతి సినిమాను నాది అనుకొని చేశానని తెలిపారు. నా అంత కమిటెడ్ ఎవరు ఉండరని.. నేను పక్కా ప్రొఫెషనల్ నటుడినని అన్నారు. నా వల్ల ఎవరు నిర్మాతలు డబ్బులు పోగొట్టు కోలేదని వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో జరిగిన రాజయోగం మూవీ టీజర్ లాంచ్ ముఖ్య అతిథిగా హాజరైన విశ్వక్ సేన్ సినిమా వివాదంపై నోరు విప్పారు.

(చదవండి: విశ్వక్‌ సేన్‌- అర్జున్‌ వివాదం..యంగ్‌ హీరోపై చర్యలు తప్పవా?)

విశ్వక్ సేన్ మాట్లాడుతూ...' మా మధ్య సరైన అవగాహన లేదు. నేను ఆ సినిమా కి నా వంతు ఎఫర్ట్స్ పెట్టి చేద్దామనుకున్నా. నేను సినిమా చెయ్యనని చెప్పలేదు. నేను ఆలస్యంగా రియలైజ్ అయ్యా. వాళ్ల మేనేజర్ రెండు రోజుల తరువాత మాకు కాల్ చేసి రెమ్యూనరేషన్ వెనక్కి పంపించమని చెప్పారు.సెట్ మీద డిస్కర్షన్ వద్దు అని రెండు రోజులు మాట్లాడుకొని వెళ్దాము అని చెప్పా. సెట్‌లో కంఫర్ట్ లేకుండా చేయలేను. నా పరిస్థితి గురించి మీకు చెప్పా. తప్పా రైటా అనేది మీరే చెప్పండి. నేను సినిమా బాగా రావడానికి మాట్లాడుకుందాం అని మెసేజ్ పెట్టా. అర్జున్ సార్ మంచి సినిమా చెయ్యాలి. వాస్తవాలు తెలీకుండా మాట్లాడుతుంటే బాధగా ఉంది. నేను ఏమి చేసిన ఆ సినిమా మంచిగా రావడం కోసమే చేశా.' అని అన్నారు. అర్జున్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో ఆయన కూతురు హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. 

మరిన్ని వార్తలు