చిత్తూరు కుర్రోడు హీరోగా ‘ప్రేమకథ’

11 Jul, 2021 11:25 IST|Sakshi

సాక్షి,చిత్తూరు(పలమనేరు): పలమనేరు కుర్రోడు హీరోగా నటించిన కాశీ వర్సెస్‌ లవ్‌ (చిత్తూరోడి ప్రేమకథ)చిత్రం ఘన విజయం సాధిస్తుందని ఆ చిత్ర దర్శకులు అశ్విని కామరాజ్‌ శనివారం మీడియాకు తెలిపారు. పలమనేరు మండలం పకీరుపల్లికి చెందిన అశ్విని కామరాజ్‌ దర్శకులుగా జరావారిపల్లికి చెందిన చిన్నా హీరోగా, బెంగళూరుకు చెందిన సంధ్య హీరోయిన్‌గా, పదిమంది స్థానికులు ఇందులో నటించినట్లు తెలిపారు. నంది ఆర్ట్స్‌ పతాకంపై హైదరాబాద్‌కు చెందిన నంది కె.రెడ్డి నిర్మాతగా కాశీ వర్సెస్‌ లవ్‌ చిత్రాన్ని ఇటీవలే పూర్తి చేశామన్నారు.

చిత్రానికి సంబంధించిన పాటలను లహరి ఆడియో ద్వారా విడుదల చేసినట్లు తెలిపారు. పలమనేరు పరిసర ప్రాంతాలతోపాటు జిల్లాలో మేజర్‌ పార్ట్, హైదరాబాద్, గుంటూరులో చిత్ర షూటింగ్‌ పూర్తి చేసినట్లు వివరించారు.  ఈ చిత్రాన్ని నెలఖారులో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుదల చేయన్నునట్టు పేర్కొన్నారు. చిత్ర పోస్టర్లు పట్టణంలో హల్‌చల్‌ చేస్తున్నాయి.  

మరిన్ని వార్తలు