పెళ్లి విషయం దాచి ప్రేమాయణం.. నటిపై చీటింగ్‌ కేసు

4 Aug, 2022 14:27 IST|Sakshi

తిరువొత్తియూరు(చెన్నై): దిండుక్కల్‌ జిల్లా కొడైకెనాల్‌కు చెందిన ఆనంద రాజా సొంతంగా యూట్యూబ్‌ చానల్‌ నడుపుతున్నాడు. ఇందులో పలు కవితలు, కొడైకెనాల్, ప్రకృతి దృశ్యాలు ఫొటోలు తీసి వీడియోలుగా మార్చి అప్‌లోడ్‌ చేస్తుంటాడు. అందులో తాటి కొంబు ప్రాంతానికి చెందిన దివ్యభారతి (24) వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడానికి నియమించుకున్నాడు. తను రాసిన కవితను దివ్యభారతి వాక్యాలుగా రూపొందించి నటింపజేసేవాడు.

దీనికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ క్రమంలో దివ్యభారతిని ఆనంద రాజా ప్రేమించడం మొదలుపెట్టాడు. అదే సమయంలో ఆమె వివాహం చేసుకోవడానికి ఆలస్యం చేస్తూ వచ్చింది. అనంతరం ఆమె అతని నుంచి రూ.30 లక్షలు వరకు నగలు, నగదు తీసుకుంది. సందేహం వచ్చి అతను విచారించగా అప్పటికే ఆమెకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. దీనిపై అతడు దిండుక్కల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 

చదవండి: Sivakarthikeyan: డైరెక్టర్‌ శంకర్‌ కూతురు హీరోయిన్‌గా శివకార్తికేయన్‌ కొత్త సినిమా

మరిన్ని వార్తలు