Youtuber Karthik Gopi Nath Arrest: రూ. 44 లక్షల మోసం.. యూట్యూబర్‌ అరెస్ట్‌..

31 May, 2022 12:30 IST|Sakshi

Youtuber Karthik Gopi Nath Arrested For Cheating Rs 44 Lakh: ఆలయాల పునరుద్ధరణ పేరుతో రూ. 44 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడిన యూట్యూబర్, బీజేపీ మద్దతుదారుడు కార్తీక్‌ గోపీనాథ్‌ను ఆవడి పోలీసులు సోమవారం (మే 30) అరెస్టు చేశారు. ఆవడిలో స్టూడియాతోపాటుగా యూట్యూబ్‌ చానల్‌ను కార్తీక్‌ నడుపుతున్నాడు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చిన కార్తీక్‌పై దేవదాయ శాఖ కన్నెర్ర చేసింది. పెరంబలూరులో రెండు ఆలయాల పునరుద్ధరణ కోసం అంటూ.. కార్తీక్‌ విరాళాల్ని సేకరించాడు.  

ఇందులో ఒకటైన మదుర కాళి అమ్మన్‌ ఆలయం దేవదాయశాఖ పరిధిలో ఉంది. కాగా అనుమతి లేకుండా వసూళ్లకు పాల్పడినందుకు సంబంధిత అధికారులు ఆవడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో నిందితుడు రూ. 44 లక్షల మేరకు వసూళ్లకు పాల్పడినట్లు తేలింది. దీంతో కార్తీక్‌ను అరెస్టు చేశారు. అంబత్తూరు కోర్టు అతనికి జూన్‌ 13 వరకు రిమాండ్‌కు విధించింది. 

చదవండి:👇
తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు మామయ్య.. నమ్రతా ఎమోషనల్‌ పోస్ట్‌
అలా ప్రచారం చేయడం సరి కాదు: కమెడియన్‌ అలీ

>
మరిన్ని వార్తలు