యూట్యూబర్‌ మదన్‌కు రిమాండ్‌

20 Jun, 2021 18:59 IST|Sakshi

సాక్షి, చెన్నై: మహిళల గురించి అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన య్యూటూబర్‌ పబ్జి మదన్‌ను శుక్రవారం ధర్మపురిలో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రాత్రంతా అతడిని విచారణ చేశారు. శనివారం మధ్యాహ్నం సైదాపేట కోర్టులో హాజరుపరిచినానంతరం రిమాండ్‌కు తరలించారు. కాగా ఆన్‌లైన్‌ గేమ్స్, యూ ట్యూబ్‌ ద్వారా సేకరించిన విరాళాలతో మదన్‌ రెండు ఇళ్లు, మూడు లగ్జరీ కార్లు కొనుగోలు చేసినట్టు తెలిసింది. భార్య కృతిక పేరిట బ్యాంక్‌లో రూ.4 కోట్లు డిపాజిట్‌ చేసినట్టు విచారణలో తేలింది. ఇవన్నీ ఐటీ లెక్కల్లో లేని దృష్ట్యా ఆదాయ పన్నుశాఖ విచారణ మొదలెట్టింది. మరోవైపు మదన్‌ బాధితులు తమకు ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు కోరారు.

చదవండి : అసభ్య వ్యాఖ్యలు.. ప్రముఖ యూట్యూబర్‌ అరెస్ట్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు