పాట చాలా బాగుంది: వైఎస్‌ షర్మిల

13 Feb, 2021 05:24 IST|Sakshi
రాజేశ్‌ నాయుడు, వైఎస్‌ షర్మిల, వేముల సత్యం

‘‘ఈ కథలో పాత్రలు కల్పితం’ లిరికల్‌ సాంగ్ విడుదల

సినిమా కూడా విజయం సాధించాలి: షర్మిల

‘‘ఈ కథలో పాత్రలు కల్పితం’ చిత్రంలోని రెండో పాట చాలా బాగుంది.. సినిమా కూడా మంచి విజయం సాధించాలి’’ అని వైఎస్‌ షర్మిల అన్నారు. పవన్‌  తేజ్‌ కొణిదెల, మేఘన జంటగా అభిరామ్‌ ఎమ్‌. తెరకెక్కించిన చిత్రం ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. మాధవి సమర్పణలో రాజేశ్‌ నాయుడు నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.

ఈ సినిమాలోని సెకండ్‌ లిరికల్‌ సాంగ్‌ను వైఎస్‌ షర్మిల విడుదల చేశారు. ‘‘ప్రేక్షకులు థ్రిల్‌ ఫీలయ్యే ఎలిమెంట్స్‌కి ఎంటర్‌టైన్‌ మెంట్‌ జోడించి అభిరామ్‌ ఈ చిత్రాన్ని రూపొందించారు’’ అన్నారు రాజేశ్‌ నాయుడు. ‘‘పవన్‌  తేజ్‌ కొణిదెలకు ఇది పర్ఫెక్ట్‌ లాంచింగ్‌ అవుతుంది’’ అన్నారు అభిరామ్‌ ఎమ్‌.

మరిన్ని వార్తలు