ముద్దు సీన్‌ రిహార్సల్‌ అంటూ దారుణంగా ప్రవర్తించేవాడు: హీరోయిన్‌

5 Jun, 2021 10:21 IST|Sakshi

కాస్టింగ్‌ కౌచ్‌ పెద్దగా ఈ పేరు పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ  మధ్యకాలంలో సినీ పరిశ్రమలో ఎక్కడ చూసిన ఈ పేరు బాగా వినిపిస్తోంది. టీవీ, సినిమాకు సంబంధించిన కొంతమంది తారలు వరుసగా గతంలో వారు ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకునే క్రమంలో కాస్టింగ్‌ కౌచ్‌పై నోరు విప్పుతున్నారు. తాజాగా సల్మాన్‌ ఖాన్‌ సినిమాతో పరిచయమైన హీరోయిన్‌ జరీన్‌ ఖాన్‌ దీనిపై స్పందించింది. తాను కూడా కాస్టింగ్‌ కౌచ్‌ బాధితురాలినేనని గతంలో చెప్పిన ఆమె ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి దీని గురించి వివరణ ఇచ్చింది. 

కెరీర్‌ ప్రారంభంలో తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానన్న ఆమె.. ‘నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ల పేర్లను ఇప్పుడు బయట పెట్టాలనుకోవడం లేదు. అయితే బాలీవుడ్‌కు వచ్చిన కొత్తలో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. పరిశ్రమలో అతడి కంటే మంచి వ్యక్తి లేడనేవిధంగా నాతో మాట్లాడేవాడు. ఈ నేపథ్యంలో అతడి సినిమాలో నటించే అవకాశం ఇప్పిస్తానని, అయితే అందులో ముద్దు సీన్‌ ఉంటుంది. దానికి మనం ముందే రిహార్సల్‌ చేద్దామని నన్ను పిలిచాడు. అలా నాతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. మనసులోని భయాలన్ని పక్కన పెట్టు అంటూ ఆ డైరెక్టర్‌ నాతో దారుణంగా ప్రవర్తించేవాడు’ అని ఆమె చెప్పుకొచ్చింది. 

అలాగే ‘ఆ వ్యక్తి నన్ను తన దారిలోకి తెచ్చుకోవాడానికి అనేక విధాలుగా ప్రయత్నించాడు. మనం స్నేహితలకంటే ఎక్కువగా ఉందామని,  ఇక నా సినిమా ఆఫర్ల విషయాన్ని తాను చూసుకుంటానని నన్ను నమ్మించాలని చూశాడు’ అని జరీన్‌ ఖాన్‌ వెల్లడించింది. కాగా కాల్‌ సెంటర్‌లో పని చేస్తూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించానని ఈ సందర్భంగా ఆమె తెలిపింది. ఇక సల్మాన్‌ సరసన వీర్‌ సినిమాలో హీరోయిన్‌ నటించి బాలీవుడ్‌ అరంగేట్రం చేసిన ఆమె ఆ తర్వాత ‘హౌజ్‌ఫుల్‌ 2, హేట్‌ స్టోరీ 3, అక్సర్‌ 2’తో పాటు మరిన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక తెలుగులో గోపిచంద్‌ హీరోగా తెరకెక్కిన ‘చాణక్య’ చిత్రంలో జరీన్‌ ఖాన్‌ కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. 

చదవండి: డైరెక్టర్‌ను పెళ్లాడిన ప్రముఖ హీరోయిన్‌
హీరో ఆశీష్‌ గాంధీ పెళ్లి.. ఫోటోలు వైరల్‌

మరిన్ని వార్తలు