విడుదలకు ముందే మార్కెట్‌ చేస్తున్న సుధీర్‌ బాబు మూవీ

6 Jul, 2021 19:30 IST|Sakshi

కంటెంట్ పరంగా వస్తున్న చిన్న సినిమాలు ఇటీవల కాలంలో బాక్సాఫీసు వద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్ అందుకుంటున్నాయి. అన్ని రకాలుగా చిన్న సినిమాలు మంచి మార్కెట్‌ చేస్తున్నాయి. డిజటల్‌ రైట్స్‌, శాటిలైట్‌, స్ట్రీమింగ్‌ హక్కులు పరంగా మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో హీరో సుధీర్‌ బాబు లెటెస్ట్‌ మూవీ శ్రీదేవి సోడా సెంటర్‌ చేరిపోయింది. ప్రస్తుతం సుధీర్‌ బాబు ఈ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. విడుదలకు ముందే ఈ మూవీ నిర్మాతలను లాభాల బాట పట్టి‍స్తున్నట్లు తెలుస్తోంది. 

‘శ్రీదేవి సోడా సెంటర్‌’ శాటిలైట్‌, డిజిటల్‌ హక్కులను జీటీవీ గ్రూప్‌ 9 కోట్ల రూపాలయకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్‌తో మేకర్స్‌కు ఈ మూవీకి పెట్టిన పెట్టుబడి వచ్చేసిందని వినికిడి. అదే నిజమైతే సుధీర్‌ బాబు మూవీ విడుదలకు ముందే నిర్మాతలకు మంచి మార్కెట్‌ఇస్తున్నాడన్నమాట. ‘పలాస’ మూవీతో తొలి హిట్‌ అందుకున్న దర్శకుడు కరుణ్‌ కుమార్‌ ఈ మూవీని రూపొందిస్తున్నాడు. గోదావరి జిల్లా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీని 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తుంది. మణిశర్య సంగీతం అందిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు