RRR Movie : ఓటీటీ, శాటిలైట్‌ రైట్స్‌పై కీలక ప్రకటన

26 May, 2021 18:20 IST|Sakshi

దర్శకధీరుడు రాజమౌళి సినిమాలకు పంపిణీదారుల నుంచి ఎల్లప్పడూ ఫుల్‌ డిమాండ్‌ ఉంటుంది. ఆయన సినిమాలు నిర్మాణ దశలో ఉన్నప్పుడే శాటిలైట్‌, డిజిటల్‌, రీమేక్‌ హక్కులకు పోటీ నెలకొంటుంది. రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’విషయంలో ఇదే జరిగింది. ఈ మూవీ శాటిలైట్‌, డిజిటల్‌ హాక్కుల కోసం పలు సంస్థలు పోటీ పడ్డాయి. ముఖ్యంగా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ కోసం పలు ఓటీటీ సంస్థలు పోటీ పడగా.. చివరగా జీ5, నెట్‌ఫ్లిక్స్‌ ఆ హక్కులను సొంతం చేసుకున్నాయి. ఈ విషయాన్ని పెన్ స్టుడియోస్ అధికారికంగా ప్రకటించింది.

తెలుగు,తమిళ్‌, మలయాళం, కన్నడ ఓటీటీ హక్కులను జీ5 సొంతం చేసుకోగా, హిందీ, విదేశీ భాషల స్ట్రీమింగ్‌ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ చేజిక్కించుకుంది.  ఇక శాటిలైట్‌ హక్కులను కూడా ఒక్కో భాషలో ఒక్కో చానెల్‌ సొంతం​ చేసుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ హక్కులను స్టార్‌ ఇండియా నెట్‌వర్క్‌ సొంతం చేసుకుంది. ఇక హిందీ హక్కులను జీ నెట్‌వర్క్‌ చేజిక్కించుకుంది. ఆర్ఆర్ఆర్ యూనిట్ నుంచి ఇప్పటికే ఈ హక్కులన్నింటినీ పెన్ స్టుడియోస్ దక్కించుకోగా.. ఆ సంస్థ నుంచి ఇవన్నీ ఆ హక్కుల్ని సంపాదించుకున్నాయి. నార్త్ థియేట్రికల్ రైట్స్ మాత్రం పెన్ స్టుడియోస్ వద్దే ఉన్నాయి.

మరిన్ని వార్తలు