‘జీ5’లో ఆర్యన్‌ రాజేశ్‌, సదాల ‘హలో వరల్డ్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..

26 Jul, 2022 11:13 IST|Sakshi

Hello World Web Series: వరుస వెబ్‌ సిరీస్‌లతో దూసుకెళ్తోంది ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ 5’. ఇటీవల ‘మా నీళ్ల ట్యాంక్‌’తో అలరించిన జీ5.. తాజాగా మరో విభిన్న వెబ్‌ సిరీస్‌ను విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. ఐటీ ఉద్యోగుల నేపథ్యంలో రూపొందించిన ‘హలో వరల్డ్‌’సిరీస్‌ని ఆగస్ట్‌ 12 నుంచి స్ట్రీమింగ్‌ చేయనుంది. 8 ఎపిసోడ్లుగా రూపొందిన ఈ సిరీస్‌కి శివసాయి వర్థన్‌ దర్శకత్వం వహించారు. ఆర్యన్‌ రాజేశ్‌, సదా, రామ్‌ నితిన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

 భారీ అశలతో ఓ ఐటీ కంపెనీలో చేరిన ఎనిమిది మంది యువతకు చెందిన కథ ఇదని దర్శకుడు శివసాయి తెలిపారు. ఐటీ కంపెనీలో చేరిన ఆ ఎనిమిది మంది జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్‌ ఫేస్‌ చేశారనేది ఆసక్తిగా చూపించామన్నారు. తెలుగులో ఆఫీస్‌ డ్రామా వెబ్‌ సిరీస్‌లు చాలా తక్కువని, ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతికి కలిస్తుందనే నమ్మకం తనకు ఉందని తెలిపారు. ఈ సిరీస్‌కి పి.కె. దండీ సంగీతం సమకూర్చగా, ఎదురోలు రాజు సినిమాటోగ్రఫీ అందించారు. 

మరిన్ని వార్తలు