ZEE5 Movies Web Series 2022: జీ5లో 40+ వెబ్‌ సిరీస్‌లు, 40+ సినిమాలు..

9 May, 2022 21:01 IST|Sakshi

ZEE5 Blockbuster Content Slate With 80+ Movies Web Series 2022: సరికొత్త కాన్సెప్ట్స్‌, జోనర్స్‌తో ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమయ్యాయి ఓటీటీలు. ఇటీవలే తెలుగు ఓటీటీ సంస్థ ఆహా 40కుపైగా సినిమాలను ఈ నెలలో అందిస్తున్నట్లుగా ప్రకటించింది. అంతకుముందు అమెజాన్‌ ప్రైమ్‌ కూడా ఈ సంవత్సరంలో 40కుపైగా వెబ్‌ సిరీస్‌, సినిమాలతో ఎంటర్‌టైన్‌ చేసేందుకు రెడీగా ఉన్నట్లు పేర్కొంది. తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5 కూడా మూవీ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ 2022 ఏడాదిలో వచ్చే బ్లాక్‌ బస్టర్‌ కంటెంట్‌ స్లేట్‌ను రిలీజ్‌ చేసింది. 

హిందీ, తమిళం, తెలుగు, పంజాబీ, బెంగాలీ భాషలన్నింటిని కలిపి మొత్తంగా 80కుపైగా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను అందించనుంది జీ5. వీటికి సంబంధించిన టైటిల్స్‌తో కంటెంట్‌ స్లేట్‌ 2022ను విడుదల చేసింది. ఈ స్లేట్‌లో 40కుపైగా ఒరిజినల్‌ షోలు, 40కుపైగా సినిమాలు ఉన్నాయి. అత్యాధునిక థ్రిల్లర్‌లు, హై-వోల్టేజ్‌ యాక్షన్‌, గ్రిప్పింగ్‌ డ్రామాలు, లైట్‌-హార్టెడ్‌ కామెడీ, రొమాంటిక్‌ వంటి తదితర జోనర్స్‌తో ఉక్కిరిబిక్కిరి చేసేందుకు సిద్ధమైంది. 

చదవండి: వావ్‌.. సినీ ప్రియులకు ఇక పండగే.. ఓటీటీలో ఏకంగా 40

దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి వినియోగదారుడికి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేలా స్ట్రాటజీకి అనుగుణంగా, వీక్షకుల మనసుకు ‍అద్దంపట్టే కథనాలను అందించనున్నట్లు తెలిపింది. జీ5, బీబీసీ స్టూడియోస్, అప్లాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ది వైరల్‌ ఫీవర్‌ (TVF) వంటి తదితర క్రియేటివ్‌ నిర్మాణ సంస్థలతో వెట్రిమారన్‌, ప్రకాశ్‌ రాజ్, అమితాబ్‌ బచ్చన్, నాగరాజ్‌ మంజులే వంటి ప్రతిభగల వారితో వీటిని నిర్మించనుంది. హిందీ ఒరిజినల్‌ స్లేట్‌లో తాజ్‌, ఫొరెన్సిక్‌, దురంగ, అభయ్‌ 3, పిట్చర్స్‌ 2, సన్‌ ఫ్లవర్‌ 2, ట్రిప్లింగ్ 3, నెవర్‌ కిస్‌ యువర్‌ బెస్ట్ ఫ్రెండ్‌ 2 వంటి కొత్త సీజన్‌లు ఉన్నాయి. 

ఇంకా ఇవే కాకుండా రంగ్‌బాజ్‌ 3, ది కశ్మీర్‌ ఫైల్స్, జుండ్‌, అటాక్‌ ఉండగా, గాలివాన తెలుగు వెబ్‌ సిరీస్‌తోపాటు తమిళం, పంజాబీ, బెంగాలీ భాషల్లో నీలమెల్లం రథం, పింగర్‌టిప్‌ సీజన్ 2, పేపర్‌ రాకెట్‌ రెక్సే కిన్నెరసాని, యార్‌ అన్ముల్లే రిటర్న్స్‌, ఫఫ్ఫాడ్‌ జీ, మే వివాహ్‌ నహీ కరోనా తేరే నాల్‌, షికర్పూర్, రక్తకరాబి, శ్వేత్కాలి వంటి విభిన్న కథాంశాలతో తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు ఉన్నాయి. 

చదవండి: గుడ్‌న్యూస్‌ చెప్పిన ఆహా, మేలో ఏకంగా 40+ మూవీస్‌!

మరిన్ని వార్తలు