Valimai Movie: వలీమై పోస్టర్‌తో జీ5 సంచలనం.. దేశంలోనే తొలిసారిగా!

21 Mar, 2022 19:53 IST|Sakshi

వినోదాత్మక సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు డైరెక్ట్‌-టు-డిజిటల్‌ రిలీజ్‌లతో దూసుకుపోతోంది జీ 5. ‘జీ5 ఓటిటి’ అంటే ‘వినోదం మాత్రమే కాదు, అంతకు మించి’ అన్నట్లుగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ తాజాగా ఒక యాక్షన్‌ మూవీని అందుబాటులోకి తెస్తోంది. తమిళ సూపర్‌స్టార్‌ అజిత్‌ నటించిన ‘వలీమై’ ఈనెల 25 నుంచి జీ5లో ప్రదర్శితం కానుంది.

ఈ సందర్భంగా అజిత్‌ కుమార్‌ గౌరవార్ధం జీ5 సంస్థ చెన్నైలోని వైయంసీఏ సర్కిల్‌లో 10,000 అడుగుల పొడవైన అతిపెద్ద పోస్టర్‌ను ఏర్పాటు చేసింది. భారతదేశంలో ఏ ఓటీటీ సంస్థ కూడా ఇటువంటి పెద్ద పోస్టర్‌ను ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వలీమై విషయానికి వస్తే ఇందులో అజిత్ కుమార్ ఐపీఎస్‌ ఆఫీసర్ అర్జున్‌ పాత్రలో నటించగా, హ్యుమా ఖురైషీ, కార్తికేయ ముఖ్య పాత్రల్లో నటించారు. హెచ్.వినోద్‌ రచనా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌ తో కలిసి బేవ్యూ ప్రాజెక్ట్ ఎల్‌ఎల్‌పికి చెందిన బోనీ కపూర్ నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా, నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందించారు.

చదవండి: మా ఇద్దరికీ ఎందుకు ముడిపెడుతున్నారు: భాగ్యశ్రీ

మరిన్ని వార్తలు