వాస్తవ ఘటనలతో జాంబీ రెడ్డి

9 Aug, 2020 06:08 IST|Sakshi
ప్రశాంత్‌ వర్మ

‘అ!’, ‘కల్కి’ వంటి చిత్రాలతో ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల మెప్పు పొందిన దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. ‘అ!’తో జాతీయ అవార్డు పొందిన ప్రశాంత్‌ వర్మ తాజాగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘జాంబీ రెడ్డి’. యాపిల్‌ ట్రీ స్టూడియోస్‌ పతాకంపై రాజ్‌శేఖర్‌ వర్మ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్‌ లోగోను విడుదల చేశారు. నిర్మాత రాజ్‌శేఖర్‌ వర్మ మాట్లాడుతూ– ‘‘తెలుగులో తొలి జాంబీ మూవీ ‘జాంబీ రెడ్డి’తో మా సినీ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది.

ప్రశాంత్‌ వర్మ విజ¯Œ , ఫిల్మ్‌మేకింగ్‌ స్టైల్‌పై ఒక నిర్మాతగా నాకు అమితమైన నమ్మకం ఉంది. కరోనాకీ, ‘జాంబీ రెడ్డి’కీ మధ్య కనెక్షన్‌ ఏంటి? అనేది ఈ సినిమాలో ఆసక్తికరమైన విషయం. ఈ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తి కావచ్చింది.. థియేటర్లు తెరుచుకున్నాక తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు మా సినిమా రెడీ అవుతోంది’’ అన్నారు.

ప్రశాంత్‌ వర్మ మాట్లాడుతూ– ‘‘నిజ జీవిత ఘటనలను ఆధారం చేసుకొని ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. ఒక హై కాన్సెప్ట్‌ ఫిల్మ్‌ ఇది. అన్ని రకాల ప్రేక్షకులు దీన్ని ఇష్టపడతారని కచ్చితంగా చెప్పగలను. త్వరలోనే మా చిత్రంలోని తారాగణం వివరాలను వెల్లడిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మార్క్‌ కె. రాబి¯Œ , కెమెరా: అనిత్, లైన్‌ ప్రొడ్యూసర్‌: వెంకట్‌ కుమార్‌ జెట్టి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: ఆనంద్‌ పెనుమత్స, ప్రభ చింతలపాటి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా