గురువారం శ్రీ 23 శ్రీ మార్చి శ్రీ 2023

23 Mar, 2023 02:12 IST|Sakshi

వెంకటాపురం(కె)లో వర్షం నీటి నుంచి మిర్చిని ఏరుతున్న రైతులు, నేలవాలిన మొక్కజొన్న పంట(ఫైల్‌)

నేలపాలు

రెక్కల

కష్టం

సాక్షిప్రతినిధి, వరంగల్‌: అకాల వర్షం.. ఉమ్మడి వరంగల్‌ జిల్లా రైతులను అతలాకుతలం చేసింది. పంట చేతికందే సమయంలో తీరని నష్టాన్ని మిగి ల్చింది. అప్పోసప్పో చేసి పెట్టుబడులు పెట్టిన రైతు ల పరిస్థితి దయనీయంగా మారింది. హనుమకొండ, వరంగల్‌, జేఎస్‌ భూపాలపల్లి, మహబూబాబా ద్‌ జిల్లాల్లో మిర్చి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈదురుగాలులు, అకాల, వడగళ్ల వర్షంతో మామిడి కాయలు నేలరాలగా, మొక్కజొన్న తదితర పంటలు కూడా నేలమట్టం అయ్యాయి.

1,11,702 ఎకరాల్లో నష్టం...

ఈనెల 18, 19 తేదీల్లో ఈదురుగాలులు, వడగళ్లతో కురిసిన అకాల వర్షం ఉమ్మడి వరంగల్‌లోని 65 మండలాలపై ప్రభావం చూపింది. స్పందించిన ప్రభుత్వం తక్షణ సాయం కోసం సర్వేకు ఆదేశించింది. ఆయా జిల్లాల కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో తిరిగి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. మరోవైపు వ్యవసాయ, రెవెన్యూ శాఖలు పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేశాయి. 65 మండలాల్లో వర్షాలు అధిక ప్రభావం చూపగా, 672 గ్రామల్లో 71,927 మంది రైతులకు చెందిన 1,11,702 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ములుగు జిల్లా మినహా ఐదు జిల్లాల్లో రూ.102కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మహబూబాబాద్‌, జనగామ, పరకాల, నర్సంపేట, భూపాలపల్లి, ఏటూరునాగారం డివిజన్లలో పంటలు బాగా దెబ్బ తిన్నట్లు అధికారులు ఆ నివేదికలో పేర్కొన్నారు. అయితే దెబ్బతిన్న పంటల విలువ రూ.350కోట్లపైనే ఉంటుందని రైతులు, రైతు సంఘాల నాయకులు ప్రకటించారు.

రైతన్నకు దెబ్బమీద దెబ్బ..

గతేడాది తెగుళ్లతో సతమతమై కోలుకుంటున్న రైతులకు అకాల వర్షం ‘గోరుచుట్ట్టు’పై రోకటిపోటులా మారింది. తెలంగాణ వ్యాప్తంగా ఈ అకాల వర్షాలకు 2.80 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే.. ఒక్క ఉమ్మడి వరంగల్‌లో 1,11,702 ఎకరాల్లో పంటలు నేలపాలయ్యాయి. 76,628 ఎకరాల్లో మొక్కజొన్న పంట పూర్తిగా ధ్వంసం కాగా, 23,093 ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. 4,835 ఎకరాల్లో మామిడికాయలు నేలరాలగా, 3,452 ఎకరాల్లో మిరప పంట దెబ్బతింది. మిరప పైరుకు ఈసారి కూడా కొత్త రకం నల్ల తామర పురుగు సోకినందున నివారణ కోసం రైతులు మందులకు విపరీతంగా పెట్టుబడి పెట్టారు. పరిస్థితి చక్కబడడంతో ఎకరానికి సగటున 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని భావించారు. ఇదే సమయంలో వడగళ్ల వాన రూపంలో పంట నష్టపోవాల్సి వచ్చింది. ఒక్క రైతు ఎకరానికి రూ.లక్ష వరకు అంత కంటే ఎక్కువగానే పెట్టుబడి పెట్టారు. ఎండిన పంట అంచనా వేస్తే ఒక్క ఎకరానికి పెట్టుబడి కలుపుకుని రూ.3,75,000 వరకు రైతు నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు.

న్యూస్‌రీల్‌

సీఎం సారూ రైతుల గోస చూడండి

పంట చేతికందే సమయంలో వడగళ్లు, ఈదురుగాలులతో తీరని నష్టం

ఉమ్మడి వరంగల్‌లో 1,11,702 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

రూ.102కోట్లుగా ప్రాథమిక అంచనా..

రూ.350కోట్లపైనే అంటున్న రైతులు

నేడు పంట నష్టపోయిన గ్రామాల్లో కేసీఆర్‌ పర్యటన

సీఎం కేసీఆర్‌ పర్యటన ఇలా..

సాక్షి, మహబూబాబాద్‌/దుగ్గొండి: సీఎం కేసీఆర్‌ గురువారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. మహబూబాబాద్‌, వరంగల్‌ జిల్లాలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బుధవారం వెల్లడించారు. సీఎం వెంట ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉంటారని తెలిపారు.

ఖమ్మం నుంచి మానుకోటకు..

గురువారం మధ్యాహ్నం 12:10 గంటలకు సీఎం కేసీఆర్‌ ఖమ్మం నుంచి హెలికాప్టర్‌ ద్వారా మహబూబాబాద్‌ జిల్లా పెద్ద వంగర మండలం రెడ్డికుంటతండాకు చేరుకుంటా రు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను స్వయంగా పరిశీలిస్తారు. అక్కడ బాధితులతో మాట్లాడుతారు.

12.40 గంటలకు : రెడ్డికుంటతండా నుంచి హెలికాప్టర్‌ ద్వారా వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం అడవిరంగాపురం గ్రామానికి బయలుదేరుతారు.

12.55 గంటలకు : రంగాపురంలో వర్షాలు, వడగళ్లతో దెబ్బతిన్న పంటలను పరిశీ లిస్తారు. బాధిత రైతులను ఓదారుస్తారు.

మధ్యాహ్నం 1.30 : రంగాపురం నుంచి హెలికాప్టర్‌లో కరీంనగర్‌ జిల్లాకు బయలుదేరి వెళ్తారు.

హెలిపాడ్‌ల పరిశీలన

ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి

రెడ్డికుంటతండాను సందర్శించిన

కలెక్టర్‌ శశాంక, ఎస్పీ

ఉసురు తీసిన అకాల వర్షం

పంట నష్టపోయిన రైతు

అప్పులు తీర్చే మార్గం కనిపించక

బలవన్మరణం

– వివరాలు 8లోu

మరిన్ని వార్తలు