నేటినుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

24 Mar, 2023 05:56 IST|Sakshi

ములుగు: 10వ తరగతి వార్షిక పరీక్షలు రాసే విద్యార్థులు నేటి(శుక్రవారం) నుంచి ప్రైవేట్‌ ఆన్‌లైన్‌ సెంటర్ల ద్వారా హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హాల్‌ టికెట్లలో ఏౖమైనా తప్పులు ఉంటే ఏసీజీఈ అప్పని జయదేవ్‌ను సంప్రదించాలని సూచించారు.

నేడు పంచాయతీలకు అవార్డులు

ములుగు: జాతీయ పథకాల నిర్వహణలో ముందుంజలో నిలిచిన గ్రామ పంచాయతీలకు నేడు బండారుపల్లి సమీపంలోని గిరిజన భవన్‌లో జాతీయ పంచాయతీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ములుగు మండల పంచాయతీ అధికారి ఇక్బాల్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పాలకవర్గం సభ్యులు, కార్యదర్శులు విధిగా హాజరుకావాలని సూచించారు. ఉదయం 10గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుందని అన్నారు.

అమరుల త్యాగాలతోనే జీవిస్తున్నాం

ములుగు: అమరుల త్యాగాలతోనే స్వతంత్రంగా జీవించగలుగుతున్నామని ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల సబ్‌ రిజిస్ట్రార్‌ తస్లీమా మహ్మద్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో గురువారం భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల 92వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, యువత పాల్గొన్నారు.

దేశభక్తికి నిలువుటద్దం

భగత్‌సింగ్‌

ములుగు: నిస్వార్ధమైన దేశభక్తికి నిలువుటద్దం భగత్‌సింగ్‌ అని పీడీఎస్‌యూ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు చిన్నం గురువారెడ్డి అన్నారు. సంఘం జిల్లా నాయకుడు ముంజాల భిక్షపతిగౌడ్‌ అధ్యక్షతన గురువారం జిల్లాకేంద్రంలోని రిటై ర్డ్‌ భవనంలో నిర్వహించిన భగత్‌సింగ్‌ 92వ వర్ధంతి సభకు కాకతీయ యూనివర్షిటీ మాజీ ప్రొఫెసర్‌ కూరపాటి వెంకటనారాయణ, ఆది వాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్‌కుమార్‌లతో కలిసి ముఖ్య అతి థిగా హాజరై మాట్లాడారు. బ్రిటిషర్లకు వ్యతిరేఖంగా పోరాడి 23 సంవత్సరాలకే వీరమరణం పొందిన పోరాటయోధుడు భగత్‌సింగ్‌ అని గుర్తు చేశారు. పరాయిపాలన నుంచి విముక్తి కోసం పోరాడి చిన్న వయస్సులో ఉరితీయపడ్డాడని గుర్తుచేశారు. అంతకుముందు అరుణోదయ కళాకారుల డప్పు చప్పుళ్లు, ఆటపాటల నడుమ సభను ఘనంగా జరుపుకున్నారు. అమరవీరుల ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

మరిన్ని వార్తలు