పనుల్లో నాణ్యత పాటించాలి

24 Mar, 2023 05:56 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న అల్లెం అప్పయ్య

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: ఆరోగ్య ఉప కేంద్రాల్లో సుందరీకరణ కోసం చేపట్టిన పెయింటింగ్‌ పనుల్లో నాణ్యత పాటించాలని డీఎంహెచ్‌ఓ అల్లెం అప్పయ్య పెయింటర్లకు సూచించారు. గురువారం మండలంలోని నార్లాపూర్‌ సబ్‌సెంటర్‌ను సందర్శించి రీ కలరింగ్‌ పనులను పరిశీలించారు. ఎన్‌హెచ్‌ఎం ప్రొటోకాల్‌ ప్రకారం లోగోలు కూడా వేయాలని సూచించారు. పిల్లలకు ఎన్ని టీకాలు ఇచ్చారని ఏఎన్‌ఎంని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాల్వపల్లిలో హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ను సందర్శించారు. సబ్‌ సెంటర్‌కు తాళం వేసి ఉండటంతో సంబంధింత మెడికల్‌ ఆఫీసర్‌కు ఫోన్‌ చేసి వివరణ కోరారు. మేడారంలోని సబ్‌ సెంటర్‌ను సందర్శించి డ్యూటీలో ఉన్న ఆశ వర్కర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాడ్వాయి మండలకేంద్రంలోని పీహెచ్‌సీని సందర్శించారు. అప్పటికే వైద్యాఽధికారులు రణధీర్‌, చిరంజీవులు వీక్లీ రివ్యూ మీటింగ్‌ నిర్వహిస్తుండటంతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ అప్పయ్య సమావేశం నిర్వహించారు. విధుల పట్ల అలసత్వం వహించకుండా రోగులకు వైద్య సేవలందించాలని సూచించారు.

మరిన్ని వార్తలు