సాక్షి కథనాల ఫలితంగా ఆర్‌ఓబీ

24 Mar, 2023 05:56 IST|Sakshi

కాజీపేట పట్టణంలోని రైల్వే ఫ్లైౖఓవర్‌ బ్రిడ్జిపై ఏ చిన్న ప్రమాదం జరిగినా తరచూ ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుంది. ఒక్కోమారు గంటసేపటికి పైగా బ్రిడ్జికి ఇరువైపులా కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు బారులు తీరుతుంటాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సాక్షి సమాంతర బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ 2016లో వారం రోజులపాటు వరుస కథనాలు వెలువరించింది. అన్ని రాజకీయ పక్షాలను ఐక్యం చేసి ఆందోళనలు చేయించడంతో ప్రజాప్రతినిధులు స్పందించి సీఎం కేసీఆర్‌ను ఒప్పించి రూ.79కోట్ల నిధులు మంజూరు చేయించారు. 2019లో సీఎం కేసీఆర్‌ పనులను ప్రారంభించడంతో పాత బ్రిడ్జికి సమాంతరంగా నూతన బ్రిడ్జి నిర్మాణ పనులు సాగుతున్నాయి.

సాక్షి చొరవతోనే..

కాజీపేట రైల్వే ఫ్లైౖఓవర్‌ బ్రిడ్జిపై సాక్షిలో వచ్చిన వరుస కథనాలు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడానికి ఎంతగానో దోహదపడ్డాయని చెప్పొచ్చు. వారం రోజులపాటు వార్తలు ఇవ్వడమే కాక జిల్లా ప్రజాప్రతినిధులను ఒకతాటిపైకి తెచ్చి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఘనతను సాక్షి దక్కించుకుంది.

– ఉడుతల బాబురావు, కాజీపేట

మరిన్ని వార్తలు