-

‘పది’పై ప్రత్యేక దృష్టి

25 Mar, 2023 01:52 IST|Sakshi
పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థినులు

ఎస్‌ఎస్‌తాడ్వాయి: పదో తరగతి ఉత్తమ ఫలితాల సాధనకు విద్యాశాఖ పక్కా ప్రణాళికతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాలను అమలు చేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభ కానున్న నేపథ్యంలో విద్యార్థులకు పరీక్షలు సిద్ధమవుతున్నారు. ఈ పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు ప్రీ ఫైనల్‌ పరీక్షలు జరుగుతున్నాయి. జిల్లాలో 3,170 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం పెంపునకు ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు తమ సబ్జెక్టులపై విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. సర్కారు బడుల్లో వందశాతం ఉత్తీర్ణత సాధనకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు.

మధ్యాహ్నం 2.30 గంటల వరకు

ప్రత్యేక తరగతులు..

పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నా.. ప్రత్యేక తరగతులను మాత్రం కొనసాగిస్తున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వర కు ప్రీ ఫైనల్‌–2 పరీక్షలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2.30 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. సబ్జెక్టుల్లో కీలక అంశాలకు సంబంధించిన ప్రశ్న జవాబులు ముద్రించి అభ్యాసన పుస్తకాలను విద్యార్థులకు అందించారు. బోధించిన పాఠ్యాంశాలపై ప్రత్యేక పరీక్షలు నిర్వహించడం, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సాధించి బోధిస్తున్నారు.

వందశాతం ఉత్తీర్ణతకు ప్రణాళిక

అదనపు తరగతులు నిర్వహిస్తూ

సందేహాల నివృత్తి

జిల్లాలో 3,170 మంది విద్యార్థులు

మరిన్ని వార్తలు