‘డబుల్‌’ జాబితా విడుదల చేయాలి

25 Mar, 2023 01:52 IST|Sakshi

ములుగు: డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు అర్హులైన వారి జాబితాను వెంటనే విడుదల చేయాలని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్‌ ముంజాల భిక్షపతిగౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్‌ కార్యాలయ సూపరింటెండెంట్‌కు వినతిపత్రాన్ని అందించారు. ఇప్పటి వరకు పూర్తయిన ఇళ్లను నిరుపేద కుటుంబాలకు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో ఈ నెల 27వ తేదీన జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రి నుంచి ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గద్దల ల క్ష్మీ, అరుణ, రాధక్క, తదితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగుల మహాధర్నాను విజయవంతం చేయాలి

ములుగు రూరల్‌: నేడు (శనివారం) హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన నిరుద్యోగుల మహా ధర్నాను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల 0అధ్యక్షుడు ఇమ్మడి రాకేష్‌యాదవ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ విషయంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. పరీక్షలు రాసిన నిరుద్యోగులకు రూ. లక్ష పరిహారం చెల్లించాలన్నారు. నిరుద్యోగులు, యువత, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై ధర్నాను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధా న కార్యదర్శి నగరపు రమేష్‌, సిరికొండ బలరాం, శ్రీమంతుల రవీంద్రాచారి, కొండారెడ్డి, క్రిష్ణాకర్‌, కొత్త సురేందర్‌, వెంకటేశ్‌, కోయిల కవిరాజు, కుమార్‌యాదవ్‌ పాల్గొన్నారు.

కాళేశ్వరం హుండీ ఆదాయం రూ.23.20లక్షలు

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం, అనుబంధ దేవాలయాల హుండీలను విప్పి శుక్రవారం దేవదాయశాఖ అధికారులు, స్వచ్చంధ సేవాసమితి సభ్యులు లెక్కించారు. భక్తులు హుండీల్లో కానుకలు వేయగా నగదు రూపంలో రూ.23.20,217లక్షలు ఆదాయం సమకూరింది. ఈ హుండీల నగదు లెక్కింపు దేవాదాయశాఖ పర్యవేక్షకురాలు కవిత, ఈఓ మహేష్‌, చైర్మన్‌ లింగంపల్లి శ్రీనివాసరావు సమక్షంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ వసంత, ధర్మకర్తలు అడప సమ్మయ్య, కామిడి రాంరెడ్డి, కుంభం పద్మ, శ్యాంసుందర్‌ దేవుడా, కలికోట దేవేందర్‌, సిరుప రాజయ్య పాల్గొన్నారు.

సిట్టింగ్‌ జడ్జితో

విచారణ జరిపించాలి

భూపాలపల్లి అర్బన్‌: టీఎస్‌పీఎస్సీలో జరిగిన ప్రశ్నాపత్రాల లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ నాయకులు శుక్రవారం తహసీల్దార్‌ మహ్మద్‌ ఇక్బాల్‌కు వినతిపత్రం అందజేశారు. ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శులు నేరళ్ల జోసఫ్‌, వేముల శ్రీకాంత్‌ మాట్లాడుతూ ఎంతోమంది నిరుద్యోగులు వేలాది రూపాయలు వెచ్చింది కోచింగులు తీసుకుంటూ ఈసారైనా తమకు ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా వారి ఆశలు అడియాశలు అయినట్లు తెలిపారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులపై చూపిస్తున్న మొండివైఖరిని మానుకోవాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు