గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌లు కీలకం

25 Mar, 2023 01:52 IST|Sakshi
మాట్లాడుతున్న జెడ్పీ సీఈఓ ప్రసూనరాణి

ఏటూరునాగారం: గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకమని జెడ్పీ సీఈఓ ప్రసూనరాణి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ అంతటి విజయ అధ్యక్షతన మండల స్థాయి జాతీయ పంచాయతీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. మండలంలోని 12 గ్రామ పంచాయతీలకు 9 విభాగాల్లో ఉత్తమ సేవలను గుర్తించి అవార్డులను అందజేశారు. ఇందులో 243 అవార్డులను ఆయా గ్రామ పంచాయతీ సర్పంచ్‌లను సన్మానించి సర్టిఫికెట్లు, షీల్డ్‌లను బహూకరించారు. సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, సమస్యల పరిష్కారంలో సర్పంచ్‌లు చొరవ చూపాలన్నారు. డీఎల్‌పీఓ దేవరాజ్‌ మాట్లాడుతూ నెలలో మూడు మార్లు మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయాలన్నారు. గ్రామ కార్యదర్శులు ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనిచేస్తారని, సర్పంచ్‌లు నిబంధనలను పాటిస్తూ కాల్వల నిర్మాణం, రోడ్లను నిర్మించడం, తాగునీటి సమస్యలు లేకుండా చూడటం, మహిళా సాధికారతను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్‌ సభ్యురాలు వలియాబీ, తహసీల్దార్‌ సంజీవ, పీహెచ్‌ఓ రమణ, వైస్‌ ఎంపీపీ తుమ్మ సంజీవరెడ్డి, ఐసీడీఎస్‌ సీడీపీఓ హేమలత, ఐకేపీ ఏపీఓ పాషా, సర్పంచ్‌లు ఈసం రామ్మూర్తి, చేల లక్ష్మి, సుమతి, వెంకటలక్ష్మి, రేణుక, దొడ్డ కృష్ణ, అనుముల శకుంతల, జిట్ట సమత, కాక వెంకటేశ్వర్లు, పలక చిన్నన్న, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు మనోరమ, శ్రీవిద్య, వసంత, పంచాయతీ కార్యదర్శులు సతీష్‌, రమాదేవి, నాగరాజు, సందీప్‌, హసీనా, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

సకాలంలో పనులు పూర్తి చేయాలి

మన ఊరు మన బడి కింద మంజూరైన నిధులతో చేపట్టిన పాఠశాలల పునరుద్ధరణ నిర్మాణం పనులు సకాలంలో పూర్తి చేయాలని, ఈనెల 31లోపు పాఠశాల వినియోగంలోకి తీసుకురావాలని జెడ్పీ సీఈఓ ప్రసూనరాణి అన్నారు. శుక్రవారం మండలంలోని ఆకులవారిఘణపురం, జెడ్పీహెచ్‌ఎస్‌లోని మన ఊరు మన బడి పనులను ఆమె పరిశీలించి తరగతి గదుల్లోని విద్యార్థులతో మాట్లాడారు. ఎంఈఓ సురేందర్‌, హెచ్‌ఎంలున్నారు.

జెడ్పీ సీఈఓ ప్రసూనరాణి

మరిన్ని వార్తలు