గ్రామాల అభివృద్ధిలో పోటీ పడాలి

26 Mar, 2023 01:42 IST|Sakshi
ములుగు సర్పంచ్‌, కార్యదర్శిని సన్మానిస్తున్న కలెక్టర్‌, ప్రజా ప్రతినిధులు

ములుగు: గ్రామాల అభివృద్ధిలో పోటీపడి వచ్చే ఏడాది జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా చూడాలని కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శనివారం దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ్‌ పంచాయతీ సతత్‌ వికాస్‌ పురస్కార్‌ జిల్లా స్థాయి జాతీయ పంచాయతీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈ కార్యక్రమం అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అధ్యక్షతన నిర్వహించగా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై తొమ్మిది విభాగాల్లో మూడు జీపీల చొప్పున ఉత్తమ ప్రతిభ చూపిన సర్పంచ్‌, కార్యదర్శులకు అవార్డులు, ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సమష్టికృషితో గ్రామాల అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. కోవిడ్‌ సమయం నుంచి పాలకవర్గంతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారుల పనితీరు బాగుందన్నారు. ఇక ఇలాగే కష్టపడి మిగితా గ్రా మాలను సైతం ఆదర్శనీయంగా మార్చు కోవచ్చన్నారు. అవార్డులు, ప్రశంసలు పొం దడం ద్వారా బాధ్యతలు పెరుగుతా యన్నారు. వాజేడు, వెంకటాపురం(కె), కన్నాయిగూడెం, మంగపేట, ఎస్‌ఎస్‌ తాడ్వాయి వంటి ఏజెన్సీ ప్రాంతాల్లోనూ గ్రామాలు గొప్పగా ఉన్నాయని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారని వివరించారు. అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. అనంతరం ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, ప్రజా ప్రతినిధులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ బడే నాగజ్యోతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ గోవింద్‌నాయక్‌, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బుచ్చయ్య, ఎంపీపీలు గండ్రకోట శ్రీదేవిసుధీర్‌, సూడి శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీలు పాయం రమణ, తల్లడి పుష్పలత, డీపీఓ వెంకయ్య, జెడ్పీ ఈసీఈఓ ప్రసూనారాణి, డీఆర్డీఓ నాగపద్మజ, డీఎంహెచ్‌ఓ అల్లెం అప్పయ్య, డీఈఓ పాణిని పాల్గొన్నారు.

ఏటూరునాగారానికి నాలుగు..మంగపేటకు..

ఏటూరునాగారం/మంగపేట: ఏటూరునాగారం మండల పరిధిలోని నాలుగు జీపీలకు జిల్లాస్థాయి అవార్డులు దక్కాయి. ఇందులో ఏటూరునాగారం, కొండాయి, చిన్నబోయినపల్లి, శంకరాజుపల్లిలు ఉన్నాయి. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన అవార్డుల ప్రదానోత్సవానికి సర్పంచ్‌ ఈసం రామ్మూర్తి, కార్యదర్శి అశోక్‌, చిన్నబోయినపల్లి సర్పంచ్‌ చేల లక్ష్మి, కార్యదర్శి రమాదేవి, కొండాయి సర్పంచ్‌ వెంకటేశ్వర్లు, కార్యదర్శి సతీష్‌, శంకరాజుపుల్లి సర్పంచ్‌ శకుంతల, కార్యదర్శి నాగరాజులు అవార్డులను అందుకున్నారు. అదే విధంగా మంగపేట జీపీ ప్రజలకు ఉత్తమ సేవలు అందించినందుకు గాను అవార్డుకు ఎంపికైంది. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి మాలోత్‌ హీరూ, స్పెషలాఫీసర్‌ శ్రీనివాస్‌ అవార్డును అందుకున్నారు.

కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య

ఉత్తమ గ్రామ పంచాయతీలకు

ప్రశంస పత్రాల అందజేత

>
మరిన్ని వార్తలు