ఉద్యాన పంటలకు భారీ నష్టం

20 Mar, 2023 01:46 IST|Sakshi

అకాల వర్షానికి జిల్లాలో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా 610 ఎకరాల్లో 341 మంది రైతుల ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు నిర్ధారించారు. పంట నష్టం రూ.39 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. మామిడి, బత్తాయి, నిమ్మ, బొప్పాయి, పుచ్చకాయ, మిర్చి పంటలకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. మామిడి 50 హెక్టార్లలో, నిమ్మ 10 హెక్టార్లలో బొప్పాయి 10 హెక్టార్లలో, బత్తాయి 46 హెక్టార్లలో, పుచ్చ 72 హెక్టార్లలో, ఇతర కూరగాయల పంటలు 26 హెక్టార్లలో, మిర్చి 30 హెక్టార్లలో నష్టం జరిగినట్లు నిర్ధారించారు. అయితే అకాల వర్షాలతో నష్టపోయిన వరి, పత్తి రైతులకు నష్టపరిహారం ఇస్తున్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఉద్యాన పంటలకు ఎలాంటి పరిహారం ఇవ్వడంలేదు. దీంతో పంట నష్టం జరిగిన రైతులు కూడా సంబందిత అధికారులకు సమాచారం ఇవ్వడంలేదు.

మరిన్ని వార్తలు