రైలు నుంచి జారిపడి మహిళ దుర్మరణం

16 Sep, 2023 07:14 IST|Sakshi

భువనగిరి: భువనగిరి మండల పరిధిలో శుక్రవారం రైలు నుంచి జారిపడి మహిళ మృతిచెందింది. పశ్చి మబెంగాల్‌ రాష్ట్రానికి చెందిన నాజీరా బీబీషేక్‌(30) భర్త సికింద్రాబాద్‌లో ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. బీబీషేక్‌ తన ఇద్దరు పిల్ల లతో కలిసి ఫలక్‌నూమా రైలులో ప్రయాణం చేస్తోంది. ఈ క్రమంలో నందనం– అనాజీపురం గ్రామాల మధ్య ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి మృతి చెందింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలా న్ని పరిశీలించి మృతదేహాన్ని నల్లగొండ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నల్లగొండ రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ రజిత తెలిపారు.

మరిన్ని వార్తలు