నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి

14 Nov, 2023 01:52 IST|Sakshi

నల్లగొండ: ఎన్నికల విధులను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు, సెక్టార్‌ ఆఫీసర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లలో సెక్టార్ల వారీగా ఎన్నికల మెటీరియల్‌ పంపిణీ చేస్తామని తెలిపారు. ఆబ్సెంట్‌ ఓటర్ల కోసం ఆర్వోల స్థాయిలో ఒక రూట్‌మ్యాప్‌ సిద్ధం చేయాలన్నారు. ఎన్నికల సిబ్బంది వారికి కేటాయించిన నియోజకవర్గ కేంద్రాల్లో ఫామ్‌ 12 ద్వారా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. సమావేశంలో ఆర్‌ఓలు హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, జె.శ్రీనివాస్‌, రవి, చెన్నయ్య, శ్రీరాములు, మాస్టర్‌ ట్రైనర్‌ తరాల పరమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

కోడ్‌ ఉల్లంఘిస్తే ఫిర్యాదులు చేయండి

ఎన్నికల మోడల్‌ కోడ్‌ను ఎవరు ఉల్లంఘించినా భారత ఎన్నికల సంఘం నియమించిన కేంద్ర సాధారణ, వ్యయ, పోలీస్‌ పరిశీలకులకు ఫిర్యాదులు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆర్‌వీవి.కర్ణన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్‌ నియోజకవర్గాల ప్రజలు సాధారణ పరిశీలకుల ఫోన్‌ 8712200653, 8143550654 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. మునుగోడు, నకిరేకల్‌ వారు ఫోన్‌ : 8143880655 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. దేవరకొండ, మునుగోడు వ్యయ పరిశీలకుల ఫోన్‌: 81438 80650 నంబర్‌ను, అలాగే దేవరకొండ, సాగర్‌, మిర్యాలగూడ వారు ఫోన్‌ : 89770 54651 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. నల్లగొండ, నకిరేకల్‌ వారు ఫోన్‌: 8712180652 నంబర్‌లో ఫిర్యాదులు చేయాలని పేర్కొన్నారు. నల్లగొండ, మునుగోడు, నకిరేకల్‌ వారు పోలీస్‌ పరిశీలకుల ఫోన్‌: 81438 80657ను, దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌కు పోలీస్‌ పరిశీలకుల ఫోన్‌ :8143780656 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

30న విద్యాసంస్థలకు సెలవు

ఈ నెల 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఒక రోజు వేతనంతో కూడిన సెలవు ఉంటుందని కలెక్టర్‌ తెలిపారు. అలాగే పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, కళాశాలలకు ఈ నెల 29వ తేదీన కూడా వేతనంతో కూడిన సెలవు ప్రకటించారు.

ఫ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్‌

మరిన్ని వార్తలు