చెర్వుగట్టులో లక్ష పుష్పార్చన

14 Nov, 2023 01:52 IST|Sakshi
స్వామివారికి లక్ష పుష్పార్చన నిర్వహిస్తున్న అర్చకులు

నార్కట్‌పల్లి: మండలంలోని చెర్వుగట్టు గ్రామంలో గల శ్రీపార్వతి జడలరామలింగేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం స్వామివారికి లక్ష పుష్పార్చన పూజ వైభవంగా నిర్వహించారు. సోమవారం అమావాస్య కావడంతో జిల్లా నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు స్వామివారి సన్నిధిలో నిద్ర చేసేందుకు పెద్ద ఎత్తున తరలి రావడంతో దేవాలయం కిటకిలాడింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ, అర్చకులు సురేష్‌శర్మ, శ్రీకాంత్‌ శర్మ, సతీష్‌ శర్మ, నాగయ్య శర్మ ఆధ్వర్యలో వివిధ పూజలు కొనసాగాయి. భక్తుల తాకిడి పెరగడంతో పోలీస్‌ సిబ్బంది గుట్టపైకి ఎలాంటి వాహనాలను అనుమతించలేదు. పూజా కార్యక్రమంలో ఆలయ ఈఓ నవీన్‌కుమార్‌, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు