చిట్యాలలో నేడు కేటీఆర్‌ రోడ్‌ షో

14 Nov, 2023 01:52 IST|Sakshi
మాట్లాడుతున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

చిట్యాల: చిట్యాలలో మంగళవారం బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ మంత్రి కేటీఆర్‌ రోడ్‌ షో కార్యక్రమంతోపాటు ఎన్నికల ప్రచార సభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నకిరేకల్‌ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. చిట్యాలలో రోడ్‌ షో, సభను నిర్వహించనున్న ప్రాంతాలను సోమవారం ఆయన స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోడ్‌ షో కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రెగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ జడల ఆదిమల్లయ్య, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కూరెళ్ల లింగస్వామి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ మెండె సైదులు, పార్టీ నాయకులు శేపూరి రవీందర్‌, బెల్లి సత్తయ్య, గుండెబోయిన సైదులు, వనం వెంకటేశ్వర్లు, జలంధర్‌రెడ్డి, పందిరి రమేష్‌, జిట్ట బొందయ్య, జమీరుద్దీన్‌, సుకూర్‌, సిలివేరు శేఖర్‌, రుద్రవరం యాదయ్య తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు