ఈవీఎంల కమిషనింగ్‌ వేగవంతం

24 Nov, 2023 02:04 IST|Sakshi
నకిరేకల్‌లో ఈవీఎంలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ కర్ణన్‌, ఆర్‌ఓ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌

నల్లగొండ, నకిరేకల్‌: ఈవీఎంలు, వీవీ ప్యాట్లలో బ్యాలెట్‌ పేపర్‌ అమర్చుట, పోలింగ్‌ సరళిని పరిశీలించే (కమిషనింగ్‌) ప్రక్రియను వేగవంతం చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కల్టెర్‌ ఆర్‌వీ.కర్ణన్‌ అన్నారు. ఈనెల 30న పోలింగ్‌ నేపథ్యంలో గురువారం నల్లగొండలోని ఎన్‌జీ కళాశాలలో, నకిరేకల్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు, వీవీ ప్యాట్లను కమిషనింగ్‌ చేసి పోలింగ్‌కు సిద్ధం చేసే ప్రక్రియను రిటర్నింగ్‌ అధికారులతో కలిసి కలెక్టర్‌ వేర్వేరుగా పరిశీలించి మాట్లాడారు. ఈ ప్రక్రియను అభ్యర్థులు, వారి పార్టీల ఏజెంట్లు సమక్షంలో ఈసీఐఎల్‌ ఇంజనీర్లతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నల్లగొండ నియోజకవర్గంలో 284 పోలింగ్‌ కేంద్రాలకు 710 బ్యాలెట్‌ యూనిట్లు, 355 కంట్రోల్‌ యూనిట్లు, 397 వీవీ ప్యాట్లు, నకిరేకల్‌లోకి 305 పోలింగ్‌ కేంద్రాలకు 763 బ్యాలెట్‌ యూనిట్లు, 381 కంట్రోల్‌ యూనిట్లు, 427 వీవీ ప్యాట్లను 13 టేబుల్స్‌ ద్వారా కమిషనింగ్‌ నిర్వహిస్తున్నారన్నారు. ఈ ప్రక్రియ శుక్రవారం నాటికి పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్‌ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, నల్లగొండ రిటర్నింగ్‌ అధికారి రవి, సిబ్బంది పాల్గొన్నారు.

గుర్తింపు కార్డు ఉంటేనే

ఓటేసెందుకు అనుమతి

జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఈనెల 30న ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుందని, ఓటరు స్లిప్‌తోపాటు ఏదైన గుర్తింపు కార్డు ఉంటేనే ఓటేసెందుకు అనుమతిస్తారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్‌ తెలిపారు. ఎపిక్‌ (ఓటర్‌ ఐడీ), ఆధార్‌, ఎంఎన్‌ఆర్‌ఈజీఏ జాబ్‌ కార్డు, పోస్టాఫీస్‌, బ్యాంక్‌లు జారీ చేసిన ఫొటోతో ఉన్న పాసుబుక్‌లు, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌, ఆర్‌జీఐ జారీచేసిన ఎన్‌పీఆర్‌ స్మార్ట్‌, ఇండియన్‌ పాస్‌ పోర్టు, ఫొటోతో కూడిన పింఛన్‌ మంజూరు డాక్యుమెంట్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపు కార్డులతోపాటు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం, దివ్యాంగుల ఐడెంటిటీ కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి ఓటేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఓటరు సమాచార స్లిప్‌లను బీఎల్‌ఓల నుంచి పొందాలని పేర్కొన్నారు. ఈవీఎంలో మనం ఏ అభ్యర్థికి ఓటు వేయాలనుకుంటామో వారి ఫొటో ఎదురుగా నీలం రంగు బటన్‌ నొక్కితే చిన్న ఎర్ర బల్బు వెలిగి శ్రీబీప్ఙ్‌ మని శబ్దం వస్తుందని, వీవీ ప్యాట్‌లో 7 సెకండ్ల వరకు స్లిప్‌ వచ్చాక ఓటింగ్‌ ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు.

ఫ జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్‌

మరిన్ని వార్తలు